Chennai IMU Assistants Recruitment 2024 : చెన్నైలోని ఇండియన్ మారిటైం యూనివర్సిటీ(ఐఎంయూ)లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు వారు తాజాగా ఓ నోటిఫికేషన్‌ను రిలీజ్ చేశారు. ఈ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఖాళీగా ఉన్న మొత్తం 27 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇండియన్ మారిటైం యూనివర్సిటీలో పలు విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. అసిస్టెంట్లుగా 15, ఫైనాన్సింగ్ అసిస్టెంట్లుగా 12 ఖాళీలను భర్తీ చేస్తారు. అర్హులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం డిగ్రీ చదివి ఉండాలి. అందులో కనీసం 50 శాతం మార్కులు వచ్చి ఉండాలి. అలాగే ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీలో పరిజ్ఞానం ఉండాలి. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు వేతనం రూ.5,200 నుంచి రూ.20,200 వరకు ఇస్తారు. వయస్సు 35 ఏళ్ల లోపు ఉండాలి. అభ్యర్థులను ఆన్‌లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఈ ప్రాంతాల్లో పనిచేయాలి..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అప్లికేషన్ ఫీజు రూ.1000గా ఉంది. ఎస్సీ, ఎస్టీలు రూ.700 చెల్లించాలి. ఈ పోస్టులకు ఎంపికైన వారు చెన్నై, ముంబై, కోల్‌కతా, విశాఖపట్నం, కొచ్చి తదితర ప్రాంతాల్లో పనిచేయాల్సి ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌ను ఢిల్లీ, లక్నో, పాట్నా, కోల్‌కతా, గౌహతి, హైదరాబాద్, చెన్నై, కొచ్చిన్, బెంగళూరు, ముంబై, భోపాల్, జైపూర్‌లలో నిర్వహిస్తారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు ఆగస్టు 30, 2024వ తేదీ వరకు గడువు ఉంది. మరిన్ని వివరాలకు అభ్యర్థులు https://www.imu.edu.in/imunew/ అనే అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.