Cochin Shipyard Limited Trainee Recruitment 2024 : టెన్త్‌, డిప్లొమా చ‌దివిన వారికి.. ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లో ఖాళీలు..

Cochin Shipyard Limited Trainee Recruitment 2024 : కేర‌ళ‌లోని ప్ర‌భుత్వ రంగ సంస్థ అయిన కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (CSL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌కు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న ఖాళీగా ఉన్న 64 ట్రెయినీ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌ను రిలీజ్ చేసింది. షిప్ డ్రాఫ్ట్స్‌మ్యాన్ ట్రెయినీ మెకానిక‌ల్ పోస్టులు 46 ఖాళీ ఉండ‌గా, షిప్ డ్రాఫ్ట్స్‌మ్యాన్ ట్రెయినీ (ఎల‌క్ట్రిక‌ల్) పోస్టులు 18 ఖాళీ ఉన్నాయి.

టెన్త్‌, డిప్లొమా (మెకానిక‌ల్ లేదా ఎల‌క్ట్రిక‌ల్‌) విద్యార్హ‌త‌లు ఉన్న‌వారు ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. అలాగే ప‌ని అనుభ‌వం ఉన్నవారికి ప్రాధాన్య‌త‌ను ఇస్తారు. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థుల వ‌య‌స్సు గ‌రిష్టంగా 25 ఏళ్ల‌కు మించ‌కూడ‌దు. 2 సంవ‌త్స‌రాలు ఈ పోస్టుల్లో ప‌నిచేయాల్సి ఉంటుంది. మొద‌టి ఏడాది నెల‌కు రూ.14,000 స్టైపెండ్ చెల్లిస్తారు. 2వ సంవ‌త్స‌రంలో నెల‌కు రూ.20,000 స్టైపెండ్ చెల్లిస్తారు.

Cochin Shipyard Limited Trainee Recruitment 2024 full details and how to apply
Cochin Shipyard Limited Trainee Recruitment 2024

రాత ప‌రీక్ష‌, ప్రాక్టిక‌ల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక‌..

ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు రూ.600 అప్లికేష‌న్ ఫీజును చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీల‌కు ఫీజు నుంచి మిన‌హాయింపును క‌ల్పించారు. రాత పరీక్ష‌, ప్రాక్టిక‌ల్ టెస్ట్ ఆధారంగా ఈ పోస్టుల‌కు అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు. ఈ పోస్టుల‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అందుకు గాను ఆగ‌స్టు 31, 2024వ తేదీ వ‌ర‌కు గ‌డువుగా నిర్ణ‌యించారు. మ‌రిన్ని వివ‌రాల‌కు అభ్య‌ర్థులు https://cochinshipyard.in అనే అధికారిక వెబ్‌సైట్‌ను సంద‌ర్శించి మరిన్ని వివ‌రాల‌ను తెలుసుకోవ‌చ్చు.