నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్ అవ‌కాశం.. జీతం నెల‌కు రూ.20వేలు..

హైద‌రాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉన్న ఆద్యాస్ జూనియ‌ర్ కాలేజీలో డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్ విభాగంలో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హత ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్నారు. ఈ జాబ్‌ను ఫుల్ టైమ్‌లో చేయాల్సి ఉంటుంది. ఆఫీస్‌లో ప‌నిచేయాలి. జీతం నెల‌కు రూ.20వేలు ఇస్తారు.

ఎంపికైన అభ్య‌ర్థులు డేటా వెరిఫికేష‌న్‌, క్వాలిటీ చెక్స్ చేయాల్సి ఉంటుంది. స‌మాచారం స‌రిగ్గా ఉందో లేదో వెరిఫై చేయాలి. ఆఫీస్‌కు సంబంధించిన డేటా విష‌యంలో పూర్తి ప్రైవసీ, సెక్యూరిటీ మెయింటెయిన్ చేయాలి. తోటి ఉద్యోగుల‌తో క‌లిసి ప‌ని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఏవైనా స‌మ‌స్య‌లు ఉంటే సూప‌ర్ వైజ‌ర్‌కు రిపోర్ట్ చేయాలి.

data entry jobs in aadyas junior college banjarahills

క‌ష్ట‌ప‌డి ప‌నిచేసే త‌త్వం అభ్య‌ర్థులు క‌లిగి ఉండాలి. బేసిక్ కంప్యూట‌ర్ నాలెడ్జి ఉంటే చాలు. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వ‌చ్చి ఉండాలి. వెర్బ‌ల్‌, రిటెన్ కమ్యూనికేష‌న్ స్కిల్స్ ఉండాలి. ఇంట‌ర్ ఆపైన చ‌దివి ఉండాలి. డిగ్రీ చ‌దివి ఉండి, ప‌ని అనుభ‌వం ఉన్న‌వారికి ప్రాధాన్య‌త‌ను ఇస్తారు. డే షిఫ్ట్ లేదా మార్నింగ్ షిఫ్ట్‌లో ప‌నిచేయాల్సి ఉంటుంది. ఇంగ్లిష్ వ‌చ్చి ఉండాలి. అభ్య‌ర్థులు మ‌రిన్ని వివ‌రాల‌కు బంజారాహిల్స్‌లో ఉన్న కాలేజీ కార్యాల‌యంలో సంప్ర‌దించ‌వ‌చ్చు.