డిజిటల్ ఇండియా కార్పొరేషన్ (DIC) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా మొత్తం 10 పోస్టులను భర్తీ చేయనున్నారు. అయితే అధికారిక వెబ్‌సైట్ అయిన dic.gov.in అనే సైట్‌ను సందర్శించి విద్యార్హతలు, ఇతర వివరాలను అభ్యర్థులు తెలుసుకోవచ్చు. అలాగే అక్కడే ఆన్‌లైన్‌లో ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.
ఈ పోస్టులకు అప్లై చేసేందుకు గాను అక్టోబర్ 24ను చివరి తేదీగా నిర్ణయించారు. మొత్తం 10 పోస్టులను భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థుల వయస్సు 32 ఏళ్ల లోపల ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.50వేల వరకు వేతనం అందిస్తారు.
DIC, NeGD, MeitY, BHASHINI తదితర వెబ్‌సైట్లలో ఇచ్చిన అధికారిక నోటిఫికేషన్‌ను అభ్యర్థులు చూడవచ్చు. అలాగే ఈ సైట్లలోని లింక్‌లపై క్లిక్ చేయడం ద్వారా కూడా ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు. ఇక అభ్యర్థులను మెరిట్ ప్రకారం ఎంపిక చేస్తారు. మార్కుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. వాళ్లను షార్ట్ లిస్ట్ చేసి తరువాత ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు. ఈ ప్రక్రియ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. కనుక ఆసక్తి, అర్హత ఉన్న వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.