DRDO Apprentice Recruitment 2024 : బెంగళూరులోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO)కు చెందిన డిఫెన్స్ బయో ఇంజినీరింగ్ అండ్ ఎలక్ట్రో మెడికల్ ల్యాబొరేటరీ పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల కోసం నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఆసక్త, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో అప్రెంటిస్ శిక్షణ కోసం ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. మొత్తం 30 పోస్టులు ఖాళీ ఉండగా.. ఎంపికైన అభ్యర్థులకు ఏడాది పాటు అప్రెంటిస్ శిక్షణ ఇస్తారు.
మెకానికల్, బయో మెడికల్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఇన్స్ట్రుమెంటేషన్, కెమికల్ విభాగాలకు చెందిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేయవచ్చు. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో అభ్యర్థులు బీఈ లేదా బీటెక్, బీఎస్సీ, బీకామ్ చదివి ఉండాలి. పని అనుభవం ఉంటే ప్రాధాన్యతను ఇస్తారు.
నెలకు రూ.9వేలు స్టైపెండ్..
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.9వేలు స్టైపెండ్ ఇస్తారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ-మెయిల్ ద్వారా hrd.debel.debel@gov.in అనే ఐడీకి పంపించాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు ఇంటర్వ్యూలను సెప్టెంబర్ 3, 4 తేదీల్లో నిర్వహిస్తారు. బెంగళూరులోని సీవీ రామన్ నగర్లో ఉన్న డీఆర్డీవో-డీఈబీఈఎల్ కార్యాలయంలో ఇంటర్యూలను నిర్వహిస్తారు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు https://www.drdo.gov.in అనే అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు. అనంతరం ఆసక్తి ఉంటే ఈ పోస్టులకు దరఖాస్తులను పైన చెప్పిన ఈ-మెయిల్ ఐడీకి పంపించవచ్చు.