డిగ్రీ చ‌దివితే చాలు.. ఈ జాబ్ మీదే..!

ప్ర‌ముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ జెన్‌పాక్ట్ ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. జెన్‌పాక్ట్ కంపెనీ ప్రాసెస్ అసోసియేట్ – క‌స్ట‌మ‌ర్ స‌ర్వీస్ పోస్టుల‌ను ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా భ‌ర్తీ చేయ‌నుంది. ఇందుకు గాను ఆస‌క్తి ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్నారు. ఏదైనా డిగ్రీ చ‌దివిన వారు ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. వీటిని ఆన్‌లైన్‌లో అప్లై చేయాల్సి ఉంటుంది.

అభ్య‌ర్థులు మ‌రిన్ని వివ‌రాల‌ను తెలుసుకోవాలంటే, ఆన్‌లైన్‌లో ఈ పోస్టుల‌కు అప్లై చేయాలంటే https://genpact.taleo.net/careersection/sgy_external_career_section/jobdetail.ftl?src=DS-10971&job=1369337 అనే లింక్‌ను సంద‌ర్శించాల్సి ఉంటుంది.

genpact process associate customer service jobs know the full details

ఎంపికైన అభ్య‌ర్థులు ప్రాసెస్ అసోసియేట్‌, క‌స్ట‌మ‌ర్ స‌ర్వీస్ ఎగ్జిక్యూటివ్‌గా ప‌నిచేయాల్సి ఉంటుంది. ఎఫెక్టివ్ ప్రోబింగ్‌, ఇంగ్లిష్ స్కిల్స్‌, క‌స్ట‌మ‌ర్ స‌ర్వీస్ రోల్ చాట్‌, ఈ మెయిల్‌, వాయిస్ వంటి స్కిల్స్ ఉండాలి. అనుభ‌వం ఉన్న‌వారికి ప్రాధాన్య‌త‌ను ఇస్తారు. ఎంపికైన అభ్య‌ర్థులు హైద‌రాబాద్‌లోని జెన్‌పాక్ట్‌లో ప‌నిచేయాల్సి ఉంటుంది.