ఈ ప్ర‌భుత్వ ఉద్యోగాల‌కు చెందిన నోటిఫికేష‌న్ల‌ను మీరు చ‌దివారా..?

తెలంగాణ‌లో 663 ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 పోస్టుల భ‌ర్తీకి గాను వైద్య‌, ఆరోగ్య సేవల రిక్రూట్‌మెంట్ బోర్డు (ఎంహెచ్ఎస్ఆర్‌బీ) నోటిఫికేష‌న్‌ను జారీ చేసింది. ఆన్‌లైన్ ప‌రీక్ష ఫీజు రూ.500. అర్హులైన అభ్య‌ర్థులు అక్టోబ‌ర్ 5 నుంచి ద‌రఖాస్తు చేసుకోవ‌చ్చు. అక్టోబ‌ర్ 21ని చివ‌రి తేదీగా నిర్ణ‌యించారు. ఆన్‌లైన్‌లో ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్స ఉంటుంది.

హైద‌రాబాద్‌లోని డిఫెన్స్ రీసెర్చి అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆర్గ‌నైజేష‌న్ (డీఆర్‌డీవో)కు చెందిన రీసెర్చ్ సెంట‌ర్ ఇమార‌త్ (ఆర్‌సీఐ) 2024-25 ఏడాదికి అప్రెంటిస్ శిక్ష‌ణ ఇచ్చేందుకు ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంక్య 200. అర్హులైన అభ్య‌ర్థులు అక్టోబ‌ర్ 12 లోగా అన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

have you read the notification for government jobs

ఇండియ‌న్ స్పేస్ రీసెర్చ్ ఆర్గ‌నైజేష‌న్ (ఇస్రో)కు చెందిన అహ్మ‌దాబాద్‌లోని స్పేస్ అప్లికేష‌న్స్ సెంట‌ర్ (ఎస్ఏసీ) జూనియ‌ర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. మొత్తం 22 ఖాళీలు ఉండ‌గా, ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేయాల్సి ఉంటుంది. చివ‌రి తేదీని అక్టోబ‌ర్ 7గా నిర్ణ‌యించారు.