HLL Lifecare Limited Recruitment 2024 : ప్రభుత్వ రంగ సంస్థ అయిన హెచ్ఎల్ఎల్ లైఫ్ కేర్ లిమిటెడ్ (HLL Lifecare Limited) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. ఈ పోస్టులకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ ఉద్యోగాల్లో చేరాలనుకునే అభ్యర్థులు సెప్టెంబర్ 4, 5 తేదీల్లో నిర్వహించే వాకిన్ ఇంటర్వ్యూలకు నేరుగా హాజరు కావచ్చు. అయితే ఇంటర్వ్యూలకు హాజరు కాలేని వారు తమ రెజ్యూమ్‌లను సెప్టెంబర్ 7వ తేదీలోగా ఈమెయిల్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. ఇందుకు గాను అభ్యర్థులు hrhincare@lifecarehll.com అనే మెయిల్ ఐడీకి తమ రెజ్యూమ్‌లను పంపించవచ్చు.
HLL Lifecare Limited లో ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్టు ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు మహారాష్ట్రలోని HLL కేంద్రాల్లో పనిచేయాల్సి ఉంటుంది. వాటిల్లో ఉండే డయాలసిస్ టెక్నిషియన్ పోస్టులతోపాటు ఇతర పోస్టులను కూడా ఈ రిక్రూట్మెంట్లో భాగంగా భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు మరిన్న వివరాల కోసం https://www.lifecarehll.com/ అనే అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
మొత్తం 1121 ఖాళీలు..
ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియలో మొత్తం 1121 ఖాళీలను భర్తీ చేస్తారు. సీనియర్ డయాలసిస్ టెక్నిషియన్ పోస్టులు 357 ఖాళీ ఉండగా, డయాలసిస్ టెక్నిషియన్ పోస్టులు 282, జూనియర్ డయాలసిస్ టెక్నిషియన్ పోస్టులు 264, అసిస్టెంట్ డయాలసిస్ టెక్నిషియన్ పోస్టులు 218 ఖాళీగా ఉన్నాయి. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో అభ్యర్థులు సర్టిఫకెట్ కోర్సు లేదా డిప్లొమా లేదా బీఎస్సీ చదవి ఉండాలి. ఆ విద్యార్హతలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీంతోపాటు పని అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యతను ఇస్తారు.
అభ్యర్థుల వయస్సు ఆగస్టు 1, 2024 నాటికి 37 సంవత్సరాలు మించకూడదు. అసిస్టెంట్ డయాలసిస్ టెక్నిషియన్‌కు నెలకు వేతనం రూ.24,219 ఇస్తారు. జూనియర్ డయాలసిస్ టెక్నిషియన్‌కు రూ.29,808, డయాలసిస్ టెక్నిషియన్‌కు రూ.35,397, సీనియర్ డయాలసిస్ టెక్నిషియన్‌కు రూ.53,096 నెల జీతం ఇస్తారు. సెప్టెంబర్ 4, 5 తేదీల్లో వాకిన్ ఇంటర్వ్యూలను పూణె, నాగ్ పూర్, నాసిక్, షోలాపూర్, నాందేడ్, నవీ ముంబై, అమరావతి, ఔరంగాబాద్, కొల్హాపూర్, లాతూర్‌లలో నిర్వహిస్తారు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు పైన ఇచ్చిన వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.