ప్రస్తుత తరుణంలో చాలా మంది ఆన్‌లైన్ ద్వారానే ఎక్కువగా షాపింగ్ చేస్తున్నారు. తమకు నచ్చిన వస్తువులను ఆన్‌లైన్‌లోనే ఎక్కువగా కొంటున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. ఎంతో సమయం కలసి రావడంతోపాటు ట్రాఫిక్‌లో తిరగాల్సిన పని ఉండదు. అలాగే బయట షాపుల్లో కన్నా ఆన్‌లైన్‌లో తక్కువ ధరకే వస్తువులు వస్తాయి. అందుకని షాపింగ్ కోసం చాలా మంది ప్రస్తుత తరుణంలో ఆన్‌లైన్ బాట పడుతున్నారు.
ఇక ప్రస్తుతం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సంస్థలు పండుగుల నేపథ్యంలో మెగా సేల్స్‌ను కూడా నిర్వహిస్తున్నాయి. కళ్లు చెదిరే ఆఫర్లను పలు కార్డులపై అందిస్తున్నాయి. దీంతో చాలా మంది ఈ సేల్స్‌ను సద్వినియోగం చేసుకుంటున్నారు. అయితే అంతా బాగానే ఉంది కానీ కస్టమర్లకు ఈ మధ్య కొత్త సమస్య వస్తోంది. అదేమిటంటే..
చాలా మంది ఆర్డర్ చేసిన ఫోన్లకు బదులుగా కొత్తవి రావడం లేదట. ఉపయోగించబడిన ఫోన్స్ వస్తున్నాయట. దీంతో ఓ కస్టమర్ తాను ఆర్డర్ చేసిన గూగుల్ పిక్సల్ ఫోన్ ఆల్రెడీ ఉపయోగించబడి దానిపై స్క్రాచ్‌లు ఉండడం చూసి అతను దాన్ని అప్పటికప్పుడే రిటర్న్ చేశాడు. కనుక మీరు కూడా ఫోన్లను ఆర్డర్ చేస్తుంటే జాగ్రత్త వహించండి. ఎందుకైనా మంచిది అన్‌బాక్సింగ్ చేసే సమయంలో వీడియో తీసి పెట్టుకోండి. అది ప్రూఫ్ గా పనిచేస్తుంది. దీంతో మీరు కొత్త ఫోన్‌ను తీసుకోవచ్చు, లేదంటే మీ డబ్బులు మీకు రీఫండ్ అవుతాయి. కనుక ఈ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండండి.