Netflix : ఈ రోజుల్లో చాలా మంది థియేటర్ల కన్నా ఓటీటీల్లోనే ఎక్కువగా సినిమాలను చూస్తున్నారు. రాను రాను ఓటీటీ సభ్యత్వం తీసుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇక ఓటీటీల విషయానికి వస్తే వాటిల్లో Netflix ఎంతో పురాతనమైందని చెప్పవచ్చు. కానీ దీనికి సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలంటే నెలకు కనీసం రూ.199 అయినా చెల్లించాలి. దీంతో 720పి రిజల్యూషన్‌తో కేవలం ఒకే స్క్రీన్‌లో Netflix ను యాక్సెస్ చేసేందుకు అవకాశం ఉంటుంది. అయితే మీకు Netflix సబ్‌స్క్రిప్షన్ గనుక ఉచితంగా కావాలనుకుంటే అప్పుడు మీరు కింద చెప్పిన విధంగా చేయాల్సి ఉంటుంది.
జియోలో..
టెలికాం సంస్థలైన జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా పలు ప్రీపెయిడ్ ప్లాన్లతో నెట్ ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ ను ఉచితంగా అందిస్తున్నాయి. ఇక ఆ ప్లాన్ల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. జియోలో రూ.1299 లేదా రూ.1799 ప్లాన్‌ను రీచార్జి చేసుకుంటే నెట్ ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ ను ఉచితంగా పొందవచ్చు. రూ.1299 ప్లాన్ వాలిడిటీ 84 రోజులు కాగా దీంట్లో యూజర్లకు రోజుకు 2జీబీ డేటా ఉచితంగా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఉచితంగా లభిస్తాయి. 5జి డేటా కూడా లభిస్తుంది. రూ.1799 ప్లాన్ వాలిడిటీ కూడా 84 రోజులే. కానీ దీంట్లో రోజుకు 3జీబీ డేటా ఉచితంగా లభిస్తుంది. ఇక మిగిలిన ప్రయోజనాలు రూ.1299 ప్లాన్‌లోవే ఉన్నాయి.

వొడాఫోన్ ఐడియాలో..
వొడాఫోన్ ఐడియాలో అయితే కస్టమర్లు రూ.1198 లేదా రూ.1599 ప్లాన్లను రీచార్జి చేసుకుంటే ఉచితంగా నెట్ ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ ను పొందవచ్చు. రూ.1198 ప్లాన్‌లో రోజుకు 2జీబీ డేటా ఉచితంగా లభిస్తుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 70 రోజులుగా ఉంది. దీంట్లో అన్‌లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను ఉపయోగించుకోవచ్చు. రూ.1599 ప్లాన్‌లో రోజుకు 2.5 జీబీ డేటా ఉచితంగా లభిస్తుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 84 రోజులుగా ఉంది. అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఉచితంగా లభిస్తాయి.
ఎయిర్‌టెల్‌లో..
ఇక ఎయిర్‌టెల్‌లో అయితే రూ.1798 ప్లాన్‌ను రీచార్జి చేసుకుంటే ఉచితంగా నెట్ ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ ను పొందవచ్చు. ఈ ప్లాన్‌లో కస్టమర్లకు రోజుకు 3 జీబీ డేటా ఉచితంగా లభిస్తుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 84 రోజులుగా ఉంది. దీంతోపాటు అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. ఇలా ఆయా ప్లాన్లను గనక మీరు రీచార్జి చేసుకుంటే నెట్ ఫ్లిక్స్‌కు ప్రత్యేకంగా సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సిన పనిలేదు. వాటిద్వారానే మీకు ఆ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా వస్తుంది. ప్లాన్ వాలిడిటీ ఉన్నన్ని రోజులు ఆ సబ్‌స్క్రిప్షన్ ను ఉచితంగా వాడుకోవచ్చు. కనుక మీకు కూడా నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా కావాలనుకుంటే పైన ఇచ్చిన ప్రీపెయిడ్ ప్లాన్లను ఇప్పుడే రీచార్జి చేసుకోండి.