Indian Bank LBO Recruitment 2024 : పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్నారా.. ఏదైనా బ్యాంకు ఉద్యోగం సాధించాలని ఆశిస్తున్నారా.. అయితే మీకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే ఇండియన్ బ్యాంక్‌లో ఉద్యోగాల భర్తీకి రిక్రూట్‌మెంట్ ప్రక్రియను ప్రారంభించారు. డిగ్రీ అర్హతతో ఈ జాబ్స్‌కు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (ఎల్‌బీఓ) స్కేల్-1 ఉద్యోగాలను ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఇందుకుగాను అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
అర్హులైన అభ్యర్థులు బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ https://www.indianbank.in/ ను సందర్శించి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు సెప్టెంబర్ 2, 2024వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. ఇండియన్ బ్యాంక్ తాజా రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ద్వారా 300 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో ఏపీ, తెలంగాణలో కలిపి మొత్తం 50 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
డిగ్రీ పూర్తి చేసి ఉండాలి..
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులకు జూలై 1, 2024 నాటికి 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్‌డ్ విభాగాలకు చెందిన అభ్యర్థులకు గరిష్ట వయో పరిమితిలో సడలింపులు ఉంటాయి. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు గాను ముందుగా బ్యాంక్ వెబ్ సైట్‌ను సందర్శించాలి. అందులో హోమ్ పేజీలో ఉండే ఇండియన్ బ్యాంక్ లోకల్ బ్యాంక్ ఆపీసర్ 2024 అనే లింక్‌ను క్లిక్ చేయాలి. దీంతో నోటిఫికేషన్ వివరాలను తెలుసుకోవచ్చు. తరువాత అప్లై నౌ అనే ఆప్షన్‌లోకి వెళ్లి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ముందుగా అభ్యర్థులు తమ వ్యక్తిగత వివరాలను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
3 దశల్లో ఎంపిక..
తరువాత రిజిస్టర్ ఐడీతో లాగిన్ అయి అప్లికేషన్ ఫామ్‌ను ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అనంతరం అన్ని వివరాలను ఎంటర్ చేయాలి. అప్లికేషన్ ఫామ్‌ను నింపాలి. అవసరం అయితన పత్రాలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. తరువాత దరఖాస్తు ఫీజు చెల్లించాలి. అనంతరం ఫామ్‌ను సబ్‌మిట్ చేయాలి. ఇక జనరల్, ఓబీసీ కేటగిరిలకు చెందిన అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు రూ.1000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.175 అప్లికేషన్ ఫీజు చెల్లిస్తే చాలు. అభ్యర్థులను 3 దశల్లో ఎంపిక చేస్తారు.
ముందుగా రాత పరీక్ష ఉంటుంది. తరువాత ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు. అనంతరం పత్రాల వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఉంటాయి. తరువాత అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇక త్వరలోనే ఎగ్జామ్ షెడ్యూల్‌ను ప్రకటించనున్నారు. కాగా పరీక్షను మల్టిపుల్ చాయిస్ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో మొత్తం 4 సెక్షన్లు ఉంటాయి. రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూట్ నుంచి 45 ప్రశ్నలు, జనరల్, బ్యాంకింగ్, ఎకానమీ అవేర్‌నెస్ నుంచి 40 ప్రశ్నలు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ 35 ప్రశ్నలు, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్‌ప్రిటేషన్ నుంచి 35 ప్రశ్నలు ఉంటాయి. పరీక్షను మొత్తంగా 200 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్ష వ్యవధిని 180 నిమిషాలుగా నిర్ణయించారు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతం రూ.48వేల వరకు లభిస్తుంది.