Indian Overseas Bank Apprentice Recruitment 2024 : చెన్నై ప్రధాన కేంద్రంగా విధులు నిర్వర్తిస్తున్న ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా మొత్తం 550 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. యూఆర్ కోటాలో 284 ఖాళీలుఉండగా, ఎస్సీ 78, ఎస్టీ 26, ఓబీసీ 118, ఈడబ్ల్యూఎస్ కోటాలో 44 ఖాళీలు ఉన్నాయి. వీటిల్లో ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 22 ఖాళీలు ఉండగా, తెలంగాణలో 29 ఖాళీలు ఉన్నట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఈ బ్యాంకుకు చెందిన శాఖల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఈ పోస్టులకు గాను అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా విద్యాసంస్థ నుంచి డిగ్రీ పాస్ అయి ఉండాలి. అభ్యర్థుల వయస్సు ఆగస్టు 1, 2024 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. అప్రెంటిస్ శిక్షణ ఒక సంవత్సర కాలం పాటు ఉంటుంది. ఈ శిక్షణలో నెలకు మెట్రో ప్రాంతంలో ఉన్నవారికి అయితే రూ.15వేలు, అర్బన్ ప్రాంతంలో ఉన్నవారికి రూ.12వేలు, సెమీ అర్బన్ లేదా రూరల్ ప్రాంతంలో ఉన్న వారికి నెలకు రూ.10వేలు స్టైపెండ్ ఇస్తారు.
అభ్యర్థుల ఎంపిక ఇలా..
అభ్యర్థులను ఆన్లైన్ టెస్ట్, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్లైన్ టెస్ట్ ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటుంది. జనరల్ మరియు ఫైనాన్షియల్ అవేర్‌నెస్‌లో 25 ప్రశ్నలు అడుగుతారు. 25 మార్కులు ఉంటాయి. జనరల్ ఇంగ్లిష్‌లో 25 ప్రశ్నలకు 25 మార్కులు, క్వాంటిటేటివ్ అండ్ రీజినింగ్ ఆప్టిట్యూట్లో 25 ప్రశ్నలకు 25 మార్కులు, కంప్యూటర్ సబ్జెక్ట్ నాలెడ్జ్‌లో 25 ప్రశ్నలకు 25 మార్కులు ఉంటాయి. పరీక్ష పూర్తి చేసేందుకు 90 నిమిషాలు కేటాయిస్తారు.
అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అప్లికేషన్ ఫీజు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వారు అయితే రూ.800 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులు రూ.600, దివ్యాంగులు రూ.400 చెల్లించాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తు చేయవచ్చు. ఆన్లైన్ దరఖాస్తులు ఆగస్టు 28, 2024న ప్రారంభం కాగా చివరి తేదీ సెప్టెంబర్ 10, 2024. దరఖాస్తు రుసుమును సెప్టెంబర్ 15, 2024 వరకు చెల్లించవచ్చు. ఆన్లైన్ పరీక్షను సెప్టెంబర్ 22, 2024న నిర్వహిస్తారు. మరిన్ని వివరాలకు https://www.iob.in/careers అనే అధికారిక వెబ్ సైట్‌ను అభ్యర్థులు సందర్శించవచ్చు. అక్కడే ఈ పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తు చేయవచ్చు.