భారతీయ రైళ్లలో రిజర్వేషన్ ఉన్న బోగీల్లో ప్రయాణించాలంటే టిక్కెట్లను అప్పటికప్పుడు తత్కాల్లో బుక్ చేయాలి. లేదంటే కొన్ని రోజులకు ముందుగా టిక్కెట్లను బుక్ చేసుకోవాలి. అయితే ఈమధ్య కాలంలో వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్లను కొన్నవారు ఏ బోగీలో పడితే ఆ బోగీలో ఎక్కుతున్నారని రైల్వే వారు కొత్త నియమాలను ప్రవేశపెట్టారు. ఇకపై వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్ ఉంటే ట్రెయిన్ ఎక్కడానికి వీలు లేదు. ఏసీ లేదా స్లీపర్ క్లాస్ కు చెందిన వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్ గనక ఉంటే ట్రెయిన్‌ను ఎక్కరాదు.
ఆన్లైన్లో టిక్కెట్‌ను బుక్ చేసుకుంటే రైలు కదిలే సమయానికి స్టేటస్ వెయిటింగ్ లిస్ట్ ఉంటే అప్పుడు టిక్కెట్ ఆటోమేటిగ్గా క్యాన్సిల్ అయి ఫండ్స్ వెనక్కి వస్తాయి. అదే ఆఫ్‌లైన్‌లో టిక్కెట్ బుక్ చేసుకుని ఉండి, టిక్కెట్ వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నా సరే వారు కూడా ట్రెయిన్లో ఎక్కడానికి వీలు లేదు. అలా ఎక్కితే ఏసీలో అయితే రూ.440, స్లీపర్‌లో రూ.220 చార్జిలను వసూలు చేస్తారు. అంతేకాదు, టీటీఈ మిమ్మల్ని నెక్ట్స్ వచ్చే స్టేషన్లో దింపేస్తారు. ఇలా రూల్స్‌ను అయితే మార్చారు.
అయితే ఆఫ్ లైన్లో టిక్కెట్ బుక్ చేసిన వారు స్టేటస్ వెయిటింగ్ లిస్ట్ అని ఉంటే వారు రీఫండ్ పొందేందుకు రైల్వే కౌంటర్ వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే రైల్వే వారు కొత్త రూల్‌ను తెచ్చారు. వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్ ఉంటే రిజర్వ్డ్ బోగీల్లో ఎక్కేందుకు వీలు లేదు. కానీ జనరల్ బోగీలో ప్రయాణించవచ్చని తెలిపారు. కనుక వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్ ఉందని ఆందోళన చెందాల్సిన పనిలేదు. రిజర్వ్ బోగీలో ఎక్కే వీలు లేకపోయినా జనరల్ బోగీలో ఎక్కి అదే టిక్కెట్‌తో ప్రయాణించవచ్చని రైల్వే తెలియజేసింది. కనుక రైలు ప్రయాణికులు మారిన ఈ రూల్‌ను గమనించాల్సి ఉంటుంది. దీంతో ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది.