ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (Indian Oil Corporation Limited (IOCL)) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్లో పనిచేయాలనుకునే వారికి, ప్రభుత్వ ఉద్యోగం కావాలనుకునే వారికి ఇదొక గొప్ప అవకాశం అనే చెప్పవచ్చు. అభ్యర్థులు ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం iocl.com అనే అధికారిక వెబ్సైట్ను కూడా సందర్శించవచ్చు. IOCL లో లా ఆఫీసర్ పోస్టుల భర్తీకి గాను నోటిఫికేషన్ను రిలీజ్ చేశారు.
ఈ రిక్రూట్మెంట్లో భాగంగా మొత్తం 12 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు అప్లై చేసేందుకు అక్టోబర్ 8ని చివరి తేదీగా నిర్ణయించారు. IOCLలో జాబ్ పొందాలని చూస్తున్న అభ్యర్థులు ఎల్ఎల్బీ డిగ్రీ చదివి ఉండాలి. లేదా 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ లా కోర్సును అయినా సరే పూర్తి చేయాల్సి ఉంటుంది. జనరల్, ఈడబ్ల్యూఎస్ కేటగిరిలకు చెందిన వారికి గరిష్ట వయో పరిమితిని 30 ఏళ్లుగా నిర్ణయించారు. రిజర్వ్డ్ విభాగాలకు చెందిన వారికి గరిష్ట వయో పరిమితిలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపులు ఉంటాయి.
అభ్యర్థులను మెరిట్ ప్రకారం షార్ట్ లిస్ట్ చేస్తారు. అనంతరం గ్రూప్ డిస్కషన్, గ్రూప్ టాస్క్, పర్సనల్ ఇంటర్వ్యూల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు గాను అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు పైన ఇచ్చిన వెబ్సైట్ను అభ్యర్థులు సందర్శించవచ్చు. అక్కడే ఆన్లైన్లో ఈ పోస్టులకు దరఖాస్తు కూడా చేసుకోవచ్చు. ఇక ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు వేతనం రూ.1.60 లక్షలను చెల్లిస్తారు.