Jio Phone Prima Plans : టెలికాం సంస్థ జియోలో ప్రస్తుతం దాదాపుగా 49 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. ఈ క్రమంలోనే జియో సంస్థ తన కస్టమర్లకు అనేక ప్లాన్లను అందుబాటులో ఉంచింది. అయితే ఈ మధ్య మొబైల్ టారిఫ్‌లను పెంచడంతో చాలా మంది కస్టమర్లు జియోను వదిలి బీఎస్ఎన్ఎల్‌కు మారిపోయారు. ఇంకా బీఎస్ఎన్ఎల్‌లోకి మారుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. అయితే జియోలో చవకైన ప్లాన్ల కోసం చాలా మంది చూస్తున్నారు. కానీ జియోలో అలాంటి ప్లాన్లు లేవు.
అయితే జియో ఫోన్ లేదా జియో ఫోన్ ప్రైమా ఫోన్లను వాడే వారికి మాత్రం అత్యంత చవకైన ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. ఇక వాటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. జియో ఫోన్ లేదా జియో ఫోన్ ప్రైమా ఫోన్లను వాడేవారికి రూ.223 ప్రీపెయిడ్ ప్లాన్ అందుబాటులో ఉంది. ఈ ప్లాన్‌ను ఇతర జియో వినియోగదారులకు వర్తించదు. కేవలం జియో ఫోన్ లేదా జియో ఫోన్ ప్రైమా ఫోన్లను వాడే వారికి మాత్రమే వర్తిస్తుంది. ఇక రూ.223 ప్లాన్‌ను రీచార్జి చేసుకుంటే జియో ఫోన్ లేదా జియో ఫోన్ ప్రైమా కస్టమర్లకు 28 రోజుల వాలిడిటీ లభిస్తుంది. అలాగే రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. దీంతోపాటు రోజుకు 2జీబీ డేటాను ఉచితంగా వాడుకోవచ్చు.

చవకైన ప్లాన్లు..
ఇక రూ.186తో రీచార్జి చేసుకుంటే కస్టమర్లకు 28 రోజుల వాలిడిటీ వస్తుంది. కానీ ఇందులో రోజుకు 1 జీబీ డేటా మాత్రమే వస్తుంది. అలాగే రూ.152తో రీచార్జి చేసుకుంటే ఇందులోనూ 28 రోజుల వాలిడిటీ లభిస్తుంది. కానీ రోజుకు 500 ఎంబీ డేటా మాత్రమే వస్తుంది. అయితే రోజుకు 2 జీబీ డేటాను పొందాలంటే రూ.223 ప్లాన్‌ను చవకైన ప్లాన్‌గా చెప్పవచ్చు. కనుక జియో ఫోన్ లేదా జియో ఫోన్ ప్రైమా ఫోన్లను వాడేవారు వీటిలో తమకు నచ్చిన ప్లాన్‌ను రీచార్జి చేసుకోవచ్చు.
ఇక పైన తెలిపిన అన్ని ప్లాన్లలోనూ కస్టమర్లకు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ లభిస్తాయి. అలాగే జియో టీవీ, న్యూస్, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి యాప్స్‌కు ఉచిత సబ్ స్క్రిప్షన్ లభిస్తుంది. కనుక మీరు కూడా ఇలా చవకగా జియో ప్లాన్లను పొందాలంటే మీరు వెంటనే జియో ఫోన్ లేదా జియో ఫోన్ ప్రైమాను వాడండి.