Jio Rs 749 Prepaid Plan Details : దేశంలోని అతిపెద్ద టెలికాం నెట్‌వర్క్‌లలో ఒకటైన రిలయన్స్ జియో తన కస్టమర్లకు ఎన్నో రకాల ప్లాన్లను అందిస్తోంది. అందులో భాగంగానే పలు రకాల ప్లాన్లలో ప్రత్యేకమైన ప్రయోజనాలను కూడా అందిస్తోంది. ఇక ఒక ప్లాన్‌లో ఎక్కువ కాలం పాటు వాలిడిటీ ఇవ్వడంతోపాటు ఏకంగా 20 జీబీ డేటాను కూడా ఉచితంగా అందిస్తోంది. ఇక ఈ ప్లాన్‌లో వినియోగదారులకు అన్‌లిమిటెడ్ 5జి డేటా కూడా లభిస్తుంది.
మీరు లాంగ్ వాలిడిటీతోపాటు రోజువారీ ఉపయోగించే డేటా కోటా ఎక్కువగా కావాలంటే మీరు ఈ ప్లాన్‌ను రీచార్జి చేసుకోవాలి. ఇందులో మీకు 72 రోజుల వాలిడిటీ లభిస్తుంది. అలాగే 20 జీబీ డేటా ఎక్స్‌ట్రా లభిస్తుంది. దీంతో ఈ ప్లాన్‌లో మీకు లభించే డేటా మొత్తం 164జీబీ అవుతుంది.
20 జీబీ ఎక్స్‌ట్రా డేటా..
జియో వినియోగదారులు ఈ ఎక్స్‌ట్రా డేటా బెనిఫిట్‌ను పొందాలంటే అందుకు గాను రూ.749తో రీచార్జి చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో యూజర్లకు 72 రోజుల వాలిడిటీ లభిస్తుంది. అలాగే ఈ ప్లాన్‌తో వినియోగదారులకు 20 జీబీ డేటా ఎక్స్‌ట్రాగా లభిస్తుంది. అలాగే రోజువారీ కోటా 2జీబీ డేటాను కూడా ఉపయోగించుకోవచ్చు. దీంతోపాటు అన్‌లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి.
ఇక ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులు రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను ఉచితంగా పంపించుకోవచ్చు. అలాగే జియో ఫ్యామిలీ యాప్స్ అయిన జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ తదితర యాప్స్‌ను కూడా ఈ ప్లాన్‌లో కస్టమర్లు ఉపయోగించుకోవచ్చు.
అన్‌లిమిటెడ్ 5జి డేటా..
ఇక ఈ ప్లాన్‌లో భాగంగా రోజుకు 2జీబీ చొప్పున 4జి డేటాను వాడుకోవచ్చు. అయితే 5జి సర్వీస్ ఉన్న చోట మాత్రం మీరు 5జి డేటాను అన్‌లిమిటెడ్‌గా ఉపయోగించుకోవచ్చు. ఇందులో ఎలాంటి లిమిట్ లేదు. అయితే మీరు ఉండే చోట జియో నెట్ వర్క్ 5జి ఉండాలి. అలాగే మీ ఫోన్ 5జి కెపాసిటీ ఉన్నది అయి ఉండాలి. దీంతో మీ ప్లాన్‌లోని 4జి డేటా ఖర్చు కాకుండానే 5జి డేటాను అన్‌లిమిటెడ్‌గా ఉపయోగించుకోవచ్చు. ఇలా 5జి ఫోన్లను వాడే జియో కస్టమర్లకు ఈ ప్లాన్ ఎంతో ఉపయోగంగా ఉంటుంది.