JIPMER Recruitment 2024 : పుదుచ్చేరిలోని జవహర్ లాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చి (JIPMER) వారు తమ ఇనిస్టిట్యూట్‌లో పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు గాను అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. గ్రూప్ బి అండ్ సి విభాగాల్లో మొత్తం 209 పోస్టులకు ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా ఈ పోస్టులకు అప్లై చేసేందుకు గాను ఆగస్టు 19, 2024ను చివరి తేదీగా నిర్ణయించారు. అభ్యర్థులకు ఆన్‌లైన్ ఎగ్జామ్ ఉంటుంది. అనంతరం వారిని మెరిట్ ఆధారంగా ఎంపిక చేసి వారికి స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. దాంట్లో ఉత్తీర్ణులైన వారికి ఉద్యోగావకాశం కల్పిస్తారు.
జిప్‌మర్‌లో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు పుదుచ్చేరిలో పనిచేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ జూలై 19, 2024 తేదీన ప్రారంభం కాగా చివరి తేదీ ఆగస్టు 19, 2024. ఎగ్జామ్ హాల్ టిక్కెట్లను అభ్యర్థులు సెప్టెంబర్ 2, 2024 తేదీ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్షను సెప్టెంబర్ 14, 2024వ తేదీన నిర్వహిస్తారు. గ్రూప్ వి భాగంలో మొత్తం 169 పోస్టులు ఖాళీగా ఉండగా, గ్రూప్ సి విభాగంలో 40 పోస్టులు మొత్తం కలిపి 209 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఖాళీలు ఉన్న విభాగాలు..
జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్, జూనియర్ ఆకుపేషనల్ థెరపిస్ట్, మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజిస్ట్, నర్సింగ్ ఆఫీసర్, ట్యూటర్ ఇన్ స్పీచ్ పాథాలజీ అండ్ ఆడియాలజీ, ఎక్స్ రే టెక్నిషియన్, టెక్నికల్ అసిస్టెంట్, అనస్థీషియా మెడిసిన్, ఆడియాలజీ టెక్నిషియన్, జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, ఫార్మసిస్ట్, రెస్పిరేటరీ ల్యాబొరేటరీ టెక్నిషియన్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2, కార్డియోగ్రాఫిక్ టెక్నిషియన్ తదితర విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
వేతనం వివరాలు..
గ్రూప్ బి అభ్యర్థులకు వేతనం రూ.35,400 నుంచి రూ.44,900 వరకు ఉంటుంది. గ్రూప్ సి విభాగంలో పనిచేసే వారికి రూ.25,500 నుంచి రూ.29,200 వరకు జీతం ఇస్తారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థుల కనీస వయస్సు 18 ఏళ్లు ఉండాలి. గరిష్టంగా 35 ఏళ్ల వరకు ఉండవచ్చు. పోస్టును బట్టి గరిష్ట వయో పరిమితి మారుతుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు వయో పరిమితిలో 5 ఏళ్లు సడలింపు ఇస్తారు. ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు సడలింపు ఉంటుంది. ఇతర విభాగాలకు చెందిన అభ్యర్థులకు విభాగాన్ని బట్టి కనీసం 5 నుంచి 10 ఏళ్ల వరకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. దివ్యాంగులకు 10 ఏళ్లు, దివ్యాంగ ఓబీసీలకు 13 ఏళ్లు, దివ్యాంగ ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు వయో పరిమితిలో 15 ఏళ్ల వరకు సడలింపులు ఉంటాయి.
దరఖాస్తు ఫీజు..
ఈ పోస్టులకు గాను అభ్యర్థులకు ఉండాల్సిన కనీస విద్యార్హత ఇంటర్ లేదా డిప్లొమా. అలాగే డిగ్రీ, బీఎస్సీ, పీజీ డిగ్రీ చేసిన వారు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత విభాగాల్లో కోర్సును పూర్తి చేసి ఉండాలి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అప్లికేషన్ ఫీజును రూ.1500గా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీలు రూ.1200 చెల్లించాలి. దివ్యాంగులు ఎలాంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన పనిలేదు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.jipmer.edu.in ను సందర్శించవచ్చు.