నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పలు ట్రేడ్‌లలో మొత్తం 250 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు నోటిఫికేషన్‌లో వెల్లడించారు. దరఖాస్తు ప్రక్రియకు మరో 3 రోజులు మాత్రమే గడువు ఉంది. సెప్టెంబర్ 29ని చివరి తేదీగా నిర్ణయించారు. కనుక ఆసక్తి, అర్హత ఉన్న వారు త్వరగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి.
ఎలక్ట్రికల్ విభాగంలో పోస్టులు 45 ఉండగా, మెకానికల్‌లో 95, సీ అండ్ ఐ లో 35, సివిల్‌లో 75 మొత్తం 250 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థుల వయస్సు గరిషటంగా 40 ఏళ్ల వరకు ఉండవచ్చు. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరిలకు చెందిన అభ్యర్థులు రూ.300 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. అలాగే ఎస్సీ, ఎస్‌టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ఎస్ఎం, మహిళా అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన పనిలేదు.
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.70 వేల నుంచి రూ.2 లక్షల వరకు వేతనం ఇస్తారు. మరిన్ని వివరాలకు ntpc.co.in అనే వెబ్‌సైట్‌ను అభ్యర్తులు సందర్శించవచ్చు. అక్కడే ఆన్‌లైన్‌లో ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.