Microsoft Work From Home Jobs : ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ ఔత్సాహికులైన యువతకు అద్భుతమైన ఉద్యోగ అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ సంస్థలో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేసేందుకు ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ జాబ్‌కు ఎంపికైన వారు ఇంటి నుంచే పనిచేయవచ్చు. మైక్రోసాఫ్ట్‌లో వారు రిమోట్ కస్టమర్ కేర్ ఆఫీసర్‌గా పనిచేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వారు ఆ రంగంలో కనీసం 2 ఏళ్ల అనుభవం కలిగి ఉండాలి. అలాంటి వారు మైక్రోసాఫ్ట్ వెబ్‌సైట్‌ను సందర్శించి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయవచ్చు.
రిమోట్ కస్టమర్ కేర్ ఆఫీసర్‌గా పనిచేసేవారు మైక్రోసాఫ్ట్ కస్టమర్లకు పలు రకాలుగా సేవలను అందించాలి. ఏవైనా ఉత్పత్తులను కొనుగోలు చేసిన కస్టమర్లకు వారు అడిగిన ప్రశ్నలను నివృత్తి చేయాలి. అందుకు గాను కస్టమర్లకు ఈ-మెయిల్ లేదా స్మార్ట్‌ఫోన్, చాట్ రూపంలో సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఎవరైనా వినియోగదారులు మైక్రోసాఫ్ట్‌కు చెందిన ఏవైనా ఉత్పత్తుల గురించి సమాచారం అడిగితే అందించాల్సి ఉంటుంది. కస్టమర్లతో ఉద్యోగులు చాలా మర్యాదపూర్వకంగా మాట్లాడాల్సి ఉంటుంది.
2 ఏళ్లు అనుభవం ఉంటే ప్రాధాన్యత..
మైక్రోసాఫ్ట్‌ను సంప్రదించిన లేదా కంపెనీకి చెందిన వినియోగదారుల డేటాను, లావాదేవీలను రికార్డుల రూపంలో మెయింటెయిన్ చేయాల్సి ఉంటుంది. మైక్రోసాఫ్ట్‌లోనే పనిచేస్తున్న ఇతర ఉద్యోగులతో కలిసి టీమ్ వర్క్ చేయాలి. కస్టమర్లకు సేవలను అందించాలి. ఇలా జాబ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ జాబ్‌కు గాను కస్టమర్ సర్వీస్ ఫీల్డ్‌లో కనీసం 2 ఏళ్లు అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు. అలాగే అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్స్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సూట్ మరియు సీఆర్ఎం సాఫ్ట్వేర్ పై పట్టును కలిగి ఉండాలి. అలాగే కస్టమర్లకు వచ్చే సమస్యలను పరిష్కరించగలిగే నైపుణ్యత ఉండాలి.
ఇక మైక్రోసాఫ్ట్‌లో పనిచేసే ఉద్యోగులకు అద్భుతమైన బెనిఫిట్స్ ఇస్తారు. సకాలంలో వేతనం, పనిని బట్టి ఇంక్రిమెంట్ ఉంటాయి. అలాగే ఈ జాబ్‌కు గాను రూ.63వేల వరకు ఆరంభంలోనే జీతం పొందవచ్చు. సీనియారిటీ ఉంటే ఇంకా ఎక్కువ జీతం ఇస్తారు. అదేవిధంగా ఈ జాబ్‌కు గాను అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్ అందిస్తారు. వెకేషన్స్ తీసుకోవచ్చు. రిటైర్మెంట్ కోసం ప్రత్యేక ఫండ్ పెట్టుకునే సదుపాయం కల్పిస్తారు. అలాగే పేరెంటల్ లీవ్స్, ఉచిత వసతి, ఉచిత ప్రయాణం, అలవెన్స్‌లు వంటి ప్రత్యేక సదుపాయాలను ఈ జాబ్ ద్వారా అందిస్తారు. మరిన్ని వివరాలకు మైక్రోసాఫ్ట్ సైట్‌ను సందర్శించవచ్చు.