నాబార్డ్‌లో ఉద్యోగాలు.. 10వ త‌ర‌గ‌తి చ‌దివితే చాలు.. జీతం నెల‌కు రూ.35వేలు..!

ముంబైలోని నేష‌నల్ బ్యాంక్ ఫ‌ర్ అగ్రిక‌ల్చ‌ర్ అండ్ రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ (NABARD) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా మొత్తం 108 ఆఫీస్ అడెంటెంట్ గ్రూప్ సి పోస్టుల‌ను భ‌ర్తీ చేయనున్నారు. 10వ త‌ర‌గ‌తి చ‌దివిన వారు ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేయ‌వ‌చ్చు. ఈ పోస్టుల‌కు సంబంధించిన ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ అక్టోబ‌ర్ 2 నుంచి ప్రారంభం కానుంది. అక్టోబ‌ర్ 21ని చివ‌రి తేదీగా నిర్ణ‌యించారు. మ‌రిన్ని వివ‌రాల‌కు అభ్య‌ర్థులు https://www.nabard.org/ అనే సైట్‌ను సంద‌ర్శించ‌వ‌చ్చు. అక్క‌డే ఆన్‌లైన్ లో ఈ పోస్టుల‌కు అప్లై చేయ‌వ‌చ్చు.

ఈ పోస్టుల‌కు ఎంపికైన అభ్య‌ర్థుల‌కు రూ.35వేలు నెల‌వారి వేత‌నం చెల్లిస్తారు. వ‌య‌స్సు 18 నుంచి 30 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. ఆన్‌లైన్ విధానంలో ఈ పోస్టుల‌కు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఎస్‌బీఐ కూడా ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌ను రిలీజ్ చేసింది. ఎస్‌బీఐలో రెగ్యుల‌ర్ ప్రాతిప‌దిక‌న 1511 స్పెష‌ల్ కేడ‌ర్ ఆఫీస‌ర్ (Specialist Cadre Officer) పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

nabard group c office attendant jobs

ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు ఎస్‌బీఐలో ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. అక్టోబ‌ర్ 4ను చివ‌రి తేదీగా నిర్ణ‌యించారు. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ, డాక్యుమెంట్ల వెరిఫికేష‌న్ ఆధారంగా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు. మరిన్ని వివ‌రాల‌కు అభ్య‌ర్థులు ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌ను సంద‌ర్శించ‌వ‌చ్చు.