NIMS Hyderabad Recruitment 2024 : హైదరాబాద్‌లోని నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆప్ మెడికల్ సైన్సెస్ (NIMS)లో ఖాళీగా ఉన్న టెక్నిషియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు నోటిఫికేషన్‌ను రిలీజ్ చేశారు. NIMSలో ఖాళీగా ఉన్న కాంట్రాక్ట్ బేస్డ్ టెక్నిషియన్ పోస్టులను ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేస్తారు. మొత్తం 101 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటికి గాను రాత పరీక్ష, ఇంటర్వ్యూలను నిర్వహించి అభ్యర్థులు ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.32,500 వరకు వేతనం ఇస్తారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ పోస్టులకు గాను ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా ఆగస్టు 24, 2024 వరకు చివరి తేదీ ఉంది. అభ్యర్థులు https://www.nims.edu.in/ అనే వెబ్‌సైట్‌ను సందర్శించి మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు. మొత్తం టెక్నిషియన్ పోస్టులు 101 ఉండగా వాటిల్లో రేడియాలజీ, పాథాలజీ, మైక్రో బయాలజీ, బయో మెడికల్, థెరపిస్ట్, న్యూక్లియర్ మెడిసిన్, అనస్తీషియా, బ్లడ్ బ్యాంక్ విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేస్తారు.

పని అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత..
పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ (బీఎస్సీ), పీజీ ఉత్తీర్ణతను కలిగి ఉండాలి. పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యతను ఇస్తారు. ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయస్సు 36 ఏళ్ల లోపు ఉండాలి. జీతనం రూ.32,500 వరకు ఇస్తారు. ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు రూ.1000 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్‌మెన్‌లకు ఫీజులో మినహాయింపును ఇస్తారు.
అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆఫ్‌లైన్‌లో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులను ది ఎగ్జిక్యూటివ్ రిజిస్ట్రార్, 2వ అంతస్తు, ఓల్డ్ ఓపీడీ బ్లాక్, నిమ్స్, పంజాగుట్ట చిరునామాకు పంపించాలి. అభ్యర్థులకు దరఖాస్తు చేసుకునేందుకు ఆగస్టు 24, 2024వ తేదీ వరకు గడువు ఉంది.