ప్రస్తుత ఆధార్ కార్డు మనకు ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో అందరికీ తెలిసిందే. అప్పట్లో యూపీఏ ప్రభుత్వం ఆధార్ కార్డును తీసుకువచ్చింది. వంటగ్యాస్ సబ్సిడీని నేరుగా ప్రజల ఖాతాల్లోనే జమ చేసేందుకు గాను అప్పట్లో ఆధార్ తీసుకువచ్చారు. కానీ ఆ తరువాత ఆధార్‌ను పలు ఇతర సేవలకు కూడా ఉపయోగించడం మొదలు పెట్టారు. ఆధార్ మనకు ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్‌గా కూడా పనిచేస్తుంది. కనుక టెలికాం కంపెనీలు మన ఆధార్ బయో మెట్రిక్ సహాయంతో మనకు సిమ్‌లను లేదా ల్యాండ్ లైన్ కనెక్షన్లను ఇస్తున్నాయి.
ఇక ఆధార్ కార్డు ద్వారా బ్యాంకుల్లో ఎన్నో పనులు జరుగుతున్నాయి. ఆధార్ కార్డును బ్యాంకు ఖాతాతో లింక్ చేస్తే ఆ కార్డు కింద ఎన్ని అకౌంట్లు లింక్ అయి ఉన్నాయో తెలుసుకోవచ్చు. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను అందించేందుకు లేదా నగదు ఇచ్చేందుకు ఆధార్‌కు లింక్ అయి ఉన్న బ్యాంకు అకౌంట్లను ఉపయోగిస్తున్నాయి. కనుక ఆధార్ అనేది మనకు అత్యంత ఆవశ్యకం అయింది. అయితే ఆధార్‌లోనూ కొందరికి కొన్ని తప్పులు ఉంటున్నాయి. కనుక అలాంటి తప్పులను సవరించుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
ఎలాంటి ఫీజు అవసరం లేదు..
ఇక ఆధార్‌ను ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్ ఎలాగైనా సరే అప్డేట్ చేయవచ్చు. కానీ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఆన్లైన్లో ఆధార్‌ను ఉచితంగానే అప్డేట్ చేసుకునేందుకు వీలు కల్పిస్తోంది. దీనిపై ఎప్పటి నుంచో ప్రచారం చేస్తున్నారు. మీరు గనక ఆధార్‌ను వాడుతుంటే, అందులో ఏమైనా కరెక్షన్స్ చేయాలని అనుకుంటే వెంటనే ఆధార్‌లో తప్పులను సవరించుకోండి. ఎందుకంటే ఇలాంటి సవరణలకు మామూలుగా అయితే ఫీజును వసూలు చేస్తారు. కానీ ఇప్పుడు మాత్రం ఎలాంటి ఫీజు లేకుండానే ప్రజలు తమ ఆధార్‌ను ఆన్లైన్లో అప్డేట్ చేసుకోవచ్చు.
ఇక ఆధార్‌ను ఎలాంటి ఫీజు లేకుండా ఆన్లైన్లో అప్డేట్ చేసుకునేందుకు గాను కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం అవకాశం కల్పిస్తోంది. ఇందుకు గాను సెప్టెంబర్ 14, 2024 వరకు గడువు ఉంది. కనుక మీ ఆధార్‌లో కూడా ఏమైనా మార్పులు చేయాలనుకుంటే వెంటనే త్వరపడండి. ఎలాంటి ఫీజు లేకుండా ఉచితంగానే ఆధార్‌లోని తప్పులను సవరించుకోండి. చివరి తేదీని మాత్రం మరిచిపోకండి.