లోన్ తీసుకోవాలంటే ఇంతకు ముందు పెద్ద ప్రహసనంలా ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు.. కొన్ని సెకన్ల వ్యవధిలోనే బ్యాంకులు, ఆర్థిక సంస్థలు లోన్లు ఇస్తున్నాయి. అయితే ఆర్‌బీఐ దగ్గర రిజిస్టర్ అయి ఉన్న లోన్ యాప్‌లలో లోన్ తీసుకుంటేనే మంచిది. లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అధిక మొత్తంలో వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో చాలా వరకు బ్యాంకులు యూపీఐ క్రెడిట్ లైన్ అనే ఫీచర్‌ను అందిస్తున్నాయి. దీన్నే పే లేటర్ అని కూడా అంటున్నారు. దీని వల్ల తక్షణ అవసరాల కోసం యూపీఐ ద్వారా లోన్ పొందవచ్చు. ఇది క్రెడిట్ లైన్ మాదిరిగా పనిచేస్తుంది కనుక బిల్ వచ్చాక కట్టాల్సి ఉంటుంది.
ప్రస్తుతం చాలా వరకు బ్యాంకులు యూపీఐ క్రెడిట్ లైన్ ఫీచర్‌ను అందిస్తున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకు, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లకు చెందిన కస్టమర్లు ఈ యూపీఐ క్రెడిట్ లైన్ ఫీచర్‌ను వాడుకోవచ్చు. తమ బ్యాంకు యాప్‌లోకి వెళ్లి అందులో పే లేటర్ అనే సెక్షన్‌లోకి వెళ్తే మీరు అర్హులో కాదో తెలిసిపోతుంది. ఒక వేళ పే లేటర్‌కు అర్హులు అయితే వెంటనే పే లేటర్ అకౌంట్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు.
ఇక క్రెడిట్ కార్డు బిల్ వచ్చినట్లుగానే పే లేటర్ క్రెడిట్ లైన్‌కు కూడా బిల్ వస్తుంది. దీన్ని ఏ నెల ఆ నెలకు చెల్లించాల్సి ఉంటుంది. లేదంటే భారీ ఎత్తున వడ్డీ, ఫీజు వసూలు చేస్తారు. అయితే తక్షణ అవసరాల కోసం ఈ యూపీఐ క్రెడిట్ లైన్ లేదా పే లేటర్ ఫీచర్ అద్భుతంగా పనిచేస్తుందని చెప్పవచ్చు. చేతిలో డబ్బు లేకపోతే ఏదైనా బిల్ కట్టాలనుకుంటే వెంటనే యూపీఐ ద్వారా దీంతో చెల్లింపులు చేయవచ్చు. పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పే వంటి యూపీఐ యాప్స్‌తోనూ ఈ క్రెడిట్ లైన్‌ను లింక్ చేసి వాడుకోవచ్చు. కనుక ఈ ఫీచర్ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు.