NPCIL Recruitment 2024 : టెన్త్‌, ఐటీఐ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. NPCILలో ఖాళీలు..

NPCIL Recruitment 2024 : న్యూక్లియ‌ర్ ప‌వ‌ర్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న స్టైపెండ‌రీ ట్రెయినీ పోస్టుల‌కు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. ఎంపికైన అభ్య‌ర్థులు ఫిట్ట‌ర్‌, ఎల‌క్ట్రిషియ‌న్‌, ఎల‌క్ట్రానిక్స్‌, ఇన్‌స్ట్రుమెంటేష‌న్‌, మెకానిస్ట్‌, ట‌ర్న‌ర్‌, వెల్డ‌ర్ త‌దిత‌ర విభాగాల్లో ప‌నిచేయాల్సి ఉంటుంది. ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు ఆగ‌స్టు 22, 2024వ తేదీన NPCIL విడుద‌ల చేసిన నోటిఫికేష‌న్‌ను అధికారిక వెబ్‌సైట్ npcilcareers.co.in ను సంద‌ర్శించి డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. అందులో మ‌రిన్ని వివ‌రాల‌ను తెలుసుకోవ‌చ్చు.

మొత్తం 267 స్టైపెండ‌రీ ట్రెయినీ పోస్టుల‌కు గాను రిక్రూట్‌మెంట్ ప్ర‌క్రియ‌ను ప్రారంభించారు. డాక్యుమెంట్ల వెరిఫికేష‌న్ ఆధారంగా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు. కేట‌గిరి-2 స్టైపెండ‌రీ ట్రెయినీ ఆప‌రేట‌ర్ పోస్టులు 152 ఖాళీ ఉన్నాయి. కేట‌గిరి-2 స్టైపెండ‌రీ ట్రెయినీ మెయింటెయిన‌ర్ పోస్టులు 115 ఖాళీ ఉన్నాయి. మొత్తం 267 పోస్టుల‌కు రిక్రూట్‌మెంట్ ప్ర‌క్రియ‌ను నిర్వ‌హిస్తున్నారు. అభ్య‌ర్థుల వ‌య‌స్సు 18 నుంచి 24 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.

NPCIL Recruitment 2024 know the full details and how to apply
NPCIL Recruitment 2024

రూ.32వేల వ‌ర‌కు జీతం..

ఈ పోస్టుల‌కు ఎంపికైన అభ్య‌ర్థుల‌కు మూల వేత‌నం రూ.21,700 చెల్లిస్తారు. మరో రూ.10,850 డీఏ రూపంలో చెల్లిస్తారు. మొత్తం క‌లిపి రూ.32,550 వ‌ర‌కు వేతనం ఇస్తారు. అభ్య‌ర్థులు ఈ పోస్టుల‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేయ‌వ‌చ్చు. టెన్త్‌, ఇంట‌ర్, ఐటీఐ చ‌దివిన వారు ద‌ర‌ఖాస్తు చేయ‌వ‌చ్చు. ప‌ని అనుభ‌వం ఉన్న‌వారికి ప్రాధాన్య‌త‌ను ఇస్తారు.

ఆన్‌లైన్‌లో ఇలా అప్లై చేయాలి..

అభ్య‌ర్థులు npcilcareers.co.in అనే వెబ్‌సైట్‌ను సంద‌ర్శించాలి. అందులో ఉండే కెరీర్స్ అనే బ‌ట‌న్‌పై క్లిక్ చేసి కింద‌కు స్క్రోల్ చేయాలి. దీంతో ఖాళీల వివ‌రాలు క‌నిపిస్తాయి. అక్క‌డ క‌నిపించే అప్లికేష‌న్ ఫ‌ర్ స్టైపెండ‌రీ ట్రెయినీ అనే లింక్‌పై క్లిక్ చేయాలి. దీంతో కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో ప్రొసీడ్‌పై క్లిక్ చేయాలి. త‌రువాత ఇచ్చిన వివ‌రాల‌ను నింపాలి. దీంతో రిజిస్ట్రేష‌న్ నంబ‌ర్ వ‌స్తుంది. త‌రువాత మ‌ళ్లీ సైట్‌లోకి రిజిస్ట్రేష‌న్ నంబ‌ర్‌, పాస్ వ‌ర్డ్ స‌హాయంతో లాగిన్ అవ్వాలి. అనంతరం మిగిలిన వివ‌రాల‌ను నింపి అప్లికేష‌న్‌ను పూర్తి చేయాలి.

త‌రువాత అప్లికేష‌న్ ఫామ్‌ను స‌బ్‌మిట్ చేయాలి. దీంతో ఫాం ఆన్‌లైన్‌లో స‌బ్‌మిట్ అవుతుంది. ఇలా ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేయ‌వ‌చ్చు. ఇక చివ‌ర్లో వ‌చ్చే పేజీల‌ను ప్రింట్ తీసుకోవాలి. దీంతో భ‌విష్య‌త్ రిఫ‌రెన్స్ కోసం ఆ ప్రింట్స్ ఉప‌యోగ‌ప‌డతాయి. ఇలా ఈ పోస్టుల‌కు ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేయ‌వ‌చ్చు.