NTPC Recruitment 2024 : ఎన్‌టీపీసీలో ఉద్యోగాలు.. నెల‌కు రూ.2 ల‌క్ష‌ల జీతం..

NTPC Recruitment 2024 : న్యూఢిల్లీలోని దేశంలోని అతిపెద్ద విద్యుత్ ఉత్ప‌త్తి సంస్థ నేష‌న‌ల్ థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ కార్పొరేష‌న్ (NTPC) భారీగా ఉద్యోగ నియామ‌క ప్ర‌క్రియ‌ను చేప‌ట్ట‌నుంది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను నోటిఫికేష‌న్‌ను రిలీజ్ చేసింది. ఈ పోస్టుల‌కు ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 250 డిప్యూటీ మేనేజ‌ర్ ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఎల‌క్ట్రిక‌ల్‌, మెకానిక‌ల్‌, సీ అండ్ ఐ, సివిల్ విభాగాల‌కు చెందిన అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు గాను సెప్టెంబ‌ర్ 28ను చివ‌రి తేదీగా నిర్ణ‌యించారు.

ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసే అభ్య‌ర్థులు మ‌రిన్ని వివ‌రాల‌కు https://ntpc.co.in/ అనే అధికారిక వెబ్‌సైట్‌ను సంద‌ర్శించ‌వ‌చ్చు. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసే అభ్య‌ర్థులు సంబంధిత విభాగంలో బీఈ లేదా బీటెక్ పాస్ అయి ఉండాలి. ప‌ని అనుభ‌వం ఉన్న‌వారికి ప్రాధాన్య‌త‌ను ఇస్తారు. నెల‌కు వేత‌నం రూ.70వేల నుంచి రూ.2 ల‌క్ష‌ల వ‌ర‌కు ఇస్తారు. గ‌రిష్ట వ‌యో ప‌రిమితి 40 ఏళ్లు మించ‌కూడ‌దు. ఈ పోస్టుల‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

NTPC Recruitment 2024 full details and how to apply
NTPC Recruitment 2024

ఈ పోస్టుల‌కు గాను సెప్టెంబ‌ర్ 14 నుంచి ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం అవుతుంది. సెప్టెంబ‌ర్ 28వ తేదీన ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ముగుస్తుంది. క‌నుక ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు పైన ఇచ్చిన వెబ్ సైట్‌ను సంద‌ర్శించి మ‌రిన్ని వివ‌రాల‌ను తెలుసుకోవ‌చ్చు. అలాగే ఈ ఉద్యోగాల‌కు ఆన్‌లైన్‌లో అక్క‌డే ద‌ర‌ఖాస్తు చేయ‌వ‌చ్చు.