PDIL Engineer Recruitment 2024 : నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. PDIL లో ఉద్యోగాలు..!

PDIL Engineer Recruitment 2024 : నోయిడాలో ఉన్న ప్రాజెక్ట్స్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ ఇండియా లిమిటెడ్ (PDIL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను నోటిఫికేష‌న్‌ను రిలీజ్ చేసింది. PDIL లో మొత్తం 57 ఇంజినీర్ ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న ఈ ఖాళీల‌ను భ‌ర్తీ చేస్తారు. PDIL కార్యాల‌యాలు లేదా ప్రాజెక్టు సైట్‌ల‌లో అభ్య‌ర్థులు పనిచేయాల్సి ఉంటుంది. ఈ పోస్టుల‌కు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబ‌ర్ 11వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబ‌ర్ మొద‌టి లేదా రెండో వారంలో ఇంట‌ర్వ్యూల‌ను నిర్వ‌హిస్తారు. అభ్య‌ర్థులు మ‌రిన్ని వివ‌రాల‌కు గాను https://www.pdilin.com/ అనే అధికారిక వెబ్‌సైట్‌ను సంద‌ర్శించ‌వ‌చ్చు.

PDIL లో మొత్తం 57 ఖాళీలు ఉండ‌గా డిప్లొమా ఇంజినీర్ పోస్టులు 4, డిగ్రీ ఇంజినీర్ పోస్టులు 53 ఖాళీగా ఉన్నాయి. ఫైర్ లేదా ఇండ‌స్ట్రియ‌ల్ సేఫ్టీ, సివిల్ (క‌న్‌స్ట్ర‌క్ష‌న్‌), ఎల‌క్ట్రిక‌ల్ (క‌న్‌స్ట్ర‌క్ష‌న్‌), ఇన్‌స్పెక్ష‌న్ (ఎల‌క్ట్రిక‌ల్‌), ఇన్‌స్పెక్ష‌న్ (సివిల్‌), ఇన్‌స్పెక్ష‌న్ (మెకానిక‌ల్‌), ఇన్‌స్ట్రుమెంటేష‌న్ (క‌న్‌స్ట్ర‌క్ష‌న్‌), మెకానిక‌ల్ (క‌న్‌స్ట్ర‌క్ష‌న్‌), మెకానిక‌ల్ (మెషిన‌రీ) విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. పోస్టుల‌ను అనుస‌రించి సంబంధిత విభాగంలో ఇంట‌ర్ సైన్స్ స‌బ్జెక్టులు, ఇంజినీరింగ్ డిప్లొమా, బీఎస్సీ, బీఈ లేదా బీటెక్ ల‌లో ఉత్తీర్ణ‌త సాధించి ఉండాలి. అలాగే పని అనుభ‌వం ఉన్నవారికి ప్రాధాన్య‌త‌ను ఇస్తారు.

PDIL Engineer Recruitment 2024 full details and how to apply
PDIL Engineer Recruitment 2024

ఈ పోస్టుల‌కు అప్లై చేసేందుకు గాను జ‌న‌ర‌ల్‌, ఓబీసీ అభ్య‌ర్థులు రూ.800 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ ఈడ‌బ్ల్యూఎస్ అభ్య‌ర్థులు రూ.400 చెల్లించాలి. ఈ పోస్టుల‌కు గాను అభ్య‌ర్థులు ఆన్ లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 11, 2024 వ‌ర‌కు గ‌డువును నిర్ణ‌యించారు. అక్టోబ‌ర్ మొద‌టి లేదా రెండో వారంలో వాకిన్ ఇంట‌ర్వ్యూలు ఉంటాయి. నోయిడాలో ఉన్న PDIL భ‌వన్‌లో వాకిన్ ఇంట‌ర్వ్యూల‌ను నిర్వ‌హిస్తారు.