Personal Loan Interest Rates In Banks 2024 : పర్సనల్ లోన్ అనేది బ్యాంకులు ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ఇచ్చే లోన్. ఈ లోన్ కు అప్లై చేసిన వారి క్రెడిట్ హిస్టరీ, సిబిల్ స్కోర్, ఆదాయం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు లోన్లను ఇస్తుంటాయి. వ్యక్తి యొక్క క్రెడిట్ హిస్టరీ, సిబిల్ స్కోరు, ఆదాయం ఎంత చక్కగా ఉంటే వారికి అంత ఎక్కువ మొత్తంలో లోన్ లభించే అవకాశాలు అధికంగా ఉంటాయి. అయితే పర్సనల్ లోన్ అంటే చాలా మంది ముందుగా వడ్డీ ఎంత అని చెక్ చేస్తారు. ఈ క్రమంలోనే కొన్ని బ్యాంకులు ఎక్కువగా, కొన్ని తక్కువగా వడ్డీని వసూలు చేస్తుంటాయి. ఇక పర్సనల్ లోన్లకు గాను తక్కువ వడ్డీని అందిస్తున్న బ్యాంకుల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 10 శాతం వడ్డీకే పర్సనల్ లోన్లను అందిస్తోంది. ఇందులో మీరు రూ.5 లక్షల లోన్ తీసుకుంటే మీకు 5 ఏళ్ల కాలానికి గాను నెలకు రూ.10,624 ఈఎంఐ అవుతుంది. అదే పంజాబ్ నేషనల్ బ్యాంక్ అయితే 10.4 శాతం వడ్డీ రేటు వసూలు చేస్తున్నారు. ఇందులో రూ.5 లక్షల లోన్‌కు 5 ఏళ్ల కాలానికి గాను నెలకు ఈఎంఐ రూ.10,772 అవుతుంది. అదే ఇండస్ ఇండ్ బ్యాంక్ వారు అయితే 10.49 శాతం వడ్డీని తీసుకుంటున్నారు. ఇందులో రూ.5 లక్షల లోన్‌కు నెలకు రూ.10,744 ఈఎంఐ అవుతుంది. 5 ఏళ్ల కాల వ్యవధి ఉంటుంది.
హెచ్‌డీఎఫ్‌సీలో 10.5 శాతం వడ్డీ..
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వారు 10.5 శాతం వడ్డీ రేటుతో పర్సనల్ లోన్‌ను అందిస్తున్నారు. ఇందులో 5 ఏళ్ల కాలానికి రూ.5 లక్షల లోన్ తీసుకుంటే నెలకు ఈఎంఐ రూ.10,747 అవుతుంది. పంజాబ్ అండ్ సింద్ బ్యాంకు వారు 10.75 శాతం వడ్డీ తీసుకుంటున్నారు. వీరు 5 ఏళ్ల కాలానికి గాను రూ.5 లక్షల లోన్‌కు రూ.10,809 ఈఎంఐ వసూలు చేస్తున్నారు. అలాగే ఐసీఐసీఐ బ్యాంకులో రూ.5 లక్షల లోన్‌కు 10.8 శాతం మేర వడ్డీ చెల్లించాలి. 5 ఏళ్లలో ఈ లోన్‌కు నెలకు రూ.10,821 ఈఎంఐ అవుతుంది.
బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రూ.5 లక్షల లోన్ తీసుకుంటే 10.85 శాతం వడ్డీ పడుతుంది. 5 ఏళ్లలో లోన్ చెల్లిస్తే నెలకు రూ.10,834 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే కెనరా బ్యాంకులో రూ.5 లక్షల లోన్‌కు గాను 10.95 శాతం వడ్డీ చెల్లించాలి. 5 కాలానికి ఇందులో నెలకు రూ.10,859 ఈఎంఐ అవుతుంది. కోటక్ మహీంద్రా బ్యాంకు, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకు రెండు కూడా రూ.5 లక్షల లోన్‌కు 10.99 శాతం వడ్డీని వసూలు చేస్తున్నాయి. 5 ఏళ్ల కాలానికి లోన్ తీసుకుంటే నెలకు ఈఎంఐ రూ.10,869 అవుతుంది. ఇలా ఆయా బ్యాంకులు పర్సనల్ లోన్లకు గాను భిన్న రకాల వడ్డీ రేట్లను వసూలు చేస్తున్నాయి.