Post Office FD Scheme : పోస్టాఫీసుల్లో మనకు అనేక రకాల మనీ సేవింగ్ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే పోస్టాఫీసులను నిర్వహిస్తారు కనుక మనం పొదుపు చేసుకునే డబ్బులకు పూర్తి స్థాయిలో రక్షణ ఉంటుందని చెప్పవచ్చు. ఇక పోస్టాఫీసుల్లో ఉన్న అనేక పథకాల్లో భిన్న రకాలుగా మనకు ప్రయోజనాలు కలుగుతాయి. వాటిల్లో భిన్న రకాలుగా వడ్డీ రేట్లను అందిస్తున్నారు. ఇక పోస్టాఫీస్‌లో మనం ఎఫ్డీ.. అంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేయవచ్చు. ఇందులోనూ మనం డబ్బును పొదుపు చేసుకోవచ్చు.
పోస్టాఫీస్‌లో మనం డబ్బును ఎఫ్డీ స్కీమ్‌లో గనక పొదుపు చేస్తే మనకు బ్యాంకుల కన్నా వడ్డీ రేటు ఎక్కువగానే లభిస్తుందని చెప్పవచ్చు. ప్రస్తుతం 7.5 శాతం వడ్డీ రేటును అందిస్తున్నారు. ఇక ఇది ఎప్పటికప్పుడు మారుతుంది. కనున పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఈ రేటును కూడా పెంచుతారు. కనుక మనం పెట్టిన డబ్బుకు మరింత వడ్డీ వస్తుంది. ఇక పోస్టాఫీస్‌లో ఎఫ్డీలో డబ్బును పొదుపు చేస్తే మూడింతల ఆదాయం పొందవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
పెట్టిన డబ్బుకు మూడింతలు మొత్తం..
పోస్టాఫీస్‌లో మీరు 5 ఏళ్ల కాలానికి గాను ఒక ఎఫ్డీ ఓపెన్ చేయాలి. రూ.5 లక్షలను అందులో పెట్టాలి. దీంతో మొదటి 5 ఏళ్లు మీరు పెట్టిన డబ్బుకు వడ్డీ కలిపి రూ.7,24,974 వస్తాయి. ఇప్పుడు మళ్లీ ఈ డబ్బును ఇంకో 5 ఏళ్లు రెన్యువల్ చేయాలి. దీంతో 10 ఏళ్లకు దీనిపై మీకు రూ.5,51,175 వస్తాయి. దీంతో మొత్తం డబ్బు రూ.10,51,175 అవుతుంది. ఇక మరో 5 ఏళ్ల పాటు ఈ మొత్తాన్ని రెన్యువల్ చేయాలి. దీంతో మొత్తం 15 ఏళ్లు పూర్తవుతుంది. అప్పుడు మీకు రూ.10,24,149 వస్తాయి. దీనికి మీరు పెట్టిన రూ.5 లక్షలు కలిపితే మొత్తం రూ.15,24,149 అవుతుంది. ఇలా 15 ఏళ్ల పాటు రూ.5 లక్షల ఎఫ్డీ రెండు సార్లు రెన్యువల్ అవుతుంది. దీతో మీ చేతిలో 15 ఏళ్ల అనంతరం రూ.15 లక్షలు.. అంటే మూడింతల మొత్తం ఉంటుంది.
5 ఏళ్లకు వడ్డీ రేటు ఇంత..
అయితే 5 ఏళ్ల కాలం పూర్తవుతున్న సమయంలో మీరు పోస్టాఫీస్ వారికి రెన్యువల్ గురించి సమాచారం అందించాలి. దీంతో వారు మీ ఎఫ్డీని రెన్యువల్ చేస్తారు. ఇక 5 ఏళ్ల కాలానికి గాను పోస్టాఫీస్‌లో మీరు చేసే ఎఫ్డీలకు ఏడాదికి 7.5 శాతం వడ్డీని చెల్లిస్తారు. 1 ఏడాది మాత్రమే ఎఫ్డీ చేస్తే 6.9 శాతం, 2 ఏళ్లకు 7 శాతం, 3 ఏళ్లకు 7.1 శాతం వడ్డీని చెల్లిస్తారు. సాధారణంగా బ్యాంకులతో పోలిస్తే పోస్టాఫీస్ వడ్డీ రేట్లు ఎక్కువగానే ఉంటాయి. పైగా కేంద్రం ఆధీనంలో ఉంటాయి కనుక మనం పొదుపు చేసే డబ్బుకు పూర్తి స్థాయిలో రక్షణ ఉంటుంది. అయితే మీకు గనక పిల్లలు ఉంటే వారి పేరిట ఇలా ఎఫ్డీ చేస్తే వారికి 20 ఏళ్లు నిండే సరికి రూ.15 లక్షలను వారికి మీరు అందించిన వారు అవుతారు. ఆ మొత్తం వారి చదువులకు లేదా భవిష్యత్ అవసరాలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కనుక పిల్లల భవిష్యత్తు లేదా మీ భవిష్యత్తు ఏదైనా సరే ఈ ఎఫ్డీ స్కీమ్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ఆసక్తి ఉంటే వెంటనే మీకు సమీపంలోని పోస్టాఫీస్‌కు వెళ్లి ఎఫ్డీ చేసేయండి మరి.