PSPCL Recruitment 2024 : పంజాబ్‌లోని పంజాబ్ స్టేట్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (PSPCL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. PSPCLలో మొత్తం 100 అసిస్టెంట్ ఇంజినీర్ లేదా ఓటీ (ఎలక్ట్రికల్) పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలియజేసింది. అందవల్ల గ్రాడ్యుయేట్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. విద్యుత్ సంస్థలో పనిచేయాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్న వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థుల కనీస వయస్సు 18 ఏళ్లు ఉండాలి. గరిష్టంగా 37 ఏళ్ల వరకు ఉండవచ్చు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్‌డ్ విభాగాలకు చెందిన అభ్యర్థులకు గరిష్ట వయో పరిమితిలో సడలింపులు ఉంటాయి. అభ్యర్థులు ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్‌లో బీఈ లేదా బీటెక్ లేదా బీఎస్సీ చదివి ఉండాలి. జనరల్ విభాగానికి చెందిన అభ్యర్థులు రూ.2360 అప్లికేషన్ ఫీజును చెల్లించాలి. ఎస్సీ, ఎస్‌టీ, దివ్యాంగులు రూ.1400 చెల్లిస్తే చాలు. అప్లికేషన్ ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుంది.
ఈ పోస్టులకు గాను ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 27, 2024న ప్రారంభం కాగా ఇందుకు సెప్టెంబర్ 16, 2024 వరకు గడువును నిర్ణయించారు. ఇక అప్లికేషన్ ఫీజును సెప్టెంబర్ 19, 2024 వరకు కట్టవచ్చు. అభ్యర్థులు మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు, ఆన్‌లైన్‌లో ఈ పోస్టులకు అప్లై చేసేందుకు https://www.pspcl.in/ అనే అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.