Punjab And Haryana High Court Peon Jobs 2024 : చండీగఢ్‌లోని పంజాబ్, హర్యానా హైకోర్టులో ఖాళీగా ఉన్న పోస్టులకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా కోర్టులో ఖాళీగా ఉన్న 300 ప్యూన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు పెద్దగా విద్యార్హతలు అవసరం లేదు. 8వ తరగతి నుంచి ఇంటర్ చదివి ఉంటే చాలు. అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు highcourtchd.gov.in అనే అధికారిక వెబ్‌సైట్‌ను అభ్యర్థులు సందర్శించవచ్చు. అందులోనే ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో అప్లై కూడా చేయవచ్చు.
300 పోస్టులకు ఖాళీలు..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు సెప్టెంబర్ 20, 2024ని చివరి తేదీగా నిర్ణయించారు. మొత్తం 300 పోస్టులకు ఖాళీలు ఉన్నాయి. ఏదైనా గుర్తింపు పొందిన స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు లేదా స్కూల్ నుంచి పాస్ అయి ఉండాలి. 8వ తరగతి నుంచి ఇంటర్ చదివి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
ఇతర రాష్ట్రాల నుంచి ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులతోపాటు జనరల్ కేటగిరి అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు రూ.700 చెల్లించాలి. పంజాబ్, హర్యానా, చండీగఢ్‌కు చెందిన ఎస్సీ, ఎస్‌టీ, బీసీ అభ్యర్థులు రూ.600 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. మరిన్ని వివరాలకు అభ్యర్థులు పైన ఇచ్చిన వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.