Rail Vikas Nigam Limited RVNL Recruitment 2024 : బీకామ్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. రైల్వేలో ఉద్యోగాలు..!

Rail Vikas Nigam Limited RVNL Recruitment 2024 : ఢిల్లీలో ఉన్న రైల్వే వికాస్ నిగ‌మ్ లిమిటెడ్ (RVNL ) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌కు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులను ఆహ్వానిస్తోంది. రెగ్యుల‌ర్ ప్రాతిప‌దిక‌న ఖాళీగా ఉన్న మేనేజీరియ‌ల్ పోస్టుల‌ను ఈ రిక్రూట్‌మెంట్‌లో భ‌ర్తీ చేయ‌నున్నారు. RVNL ఈ నోటిఫికేష‌న్ ద్వారా మొత్తం 24 ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్న‌ట్లు తెలియ‌జేసింది. ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు ఈ పోస్టుల‌కు ఆఫ్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబ‌ర్ 5, 2024ను ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీగా నిర్ణ‌యించారు. అభ్య‌ర్థులు మ‌రిన్ని వివ‌రాల‌కు అధికారిక వెబ్‌సైట్ అయిన https://rvnl.org/job ను సంద‌ర్శించ‌వ‌చ్చు.

మొత్తం 24 ఖాళీలు ఉండ‌గా.. డిప్యూటీ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ పోస్టులు 6, సీనియ‌ర్ మేనేజ‌ర్ పోస్టులు 6, అసిస్టెంట్ మేనేజ‌ర్ పోస్టులు 2, సీనియ‌ర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు 10 ఖాళీగా ఉన్నాయి. పోస్టును అనుస‌రించి సంబంధిత విభాగంలో సీఏ, బీకామ్‌, ఎంబీఏ (ఫైనాన్స్‌) చ‌దివి ఉండాలి. పని అనుభ‌వం ఉన్నవారికి ప్రాధాన్య‌త ఉంటుంది. డీజీఎం పోస్టుల‌కు గాను గ‌రిష్ట వ‌యో ప‌రిమితిని 45 ఏళ్లుగా నిర్ణ‌యించారు. సీనియ‌ర్ మేనేజ‌ర్ పోస్టుల‌కు 40 ఏళ్లు, మిగిలిన పోస్టుల‌కు గ‌రిష్ట వ‌యో ప‌రిమితిని 35 ఏళ్లుగా నిర్ణ‌యించారు.

Rail Vikas Nigam Limited RVNL Recruitment 2024 full details and how to apply
Rail Vikas Nigam Limited RVNL Recruitment 2024

ప‌ని అనుభ‌వం ఉంటే ప్రాధాన్య‌త‌..

అభ్య‌ర్థుల‌ను ద‌ర‌ఖాస్తుల షార్ట్ లిస్ట్‌, ప‌ని అనుభ‌వం, ఇంట‌ర్వ్యూల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆఫ్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తుల‌ను పంపించేందుకు గాను అభ్య‌ర్థులు.. డిస్పాచ్ సెక్ష‌న్‌, గ్రౌండ్ ఫ్లోర్‌, ఆగ‌స్ట్ క్రాంతి భ‌వ‌న్‌, భికాజీ కామా, ఆర్కే పురం, న్యూఢిల్లీ అనే అడ్ర‌స్‌కు పంపించాల్సి ఉంటుంది.

రైల్ వికాస్ నిగ‌మ్ లిమిటెడ్ (RVNL) అనేది ఒక కేంద్ర ప్ర‌భుత్వ రంగ సంస్థ‌. ప్రాజెక్ట్ అమ‌లు, ర‌వాణా, మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌కు ప‌నిచేస్తుంది. కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వ‌ర్యంలో RVNL నిర్వ‌హించ‌బ‌డుతుంది. 2003వ సంవ‌త్స‌రంలో దీన్ని స్థాపించారు. కాగా పైన చెప్పిన పోస్టుల‌కు గాను మ‌రింత స‌మాచారం తెలుసుకోవాలంటే పైన ఇచ్చిన అధికార సైట్‌ను అభ్య‌ర్థులు సంద‌ర్శించ‌వ‌చ్చు.