టెలికాం సంస్థ రిలయన్స్ జియో మార్కెట్‌లోకి అడుగు పెట్టి 8 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆ సంస్థ తన ప్రీపెయిడ్ కస్టమర్లకు పరిమిత కాలంలో అద్భుతమైన ఆఫర్‌ను అందిస్తుంది. పలు ఎంపిక చేసిన ప్లాన్ల ధరలను తగ్గించింది. ఈ ప్లాన్లను సెప్టెంబర్ 10వ తేదీ లోపు రీచార్జి చేసుకుంటే తక్కువ ధరకే పొందవచ్చు. ఇక రాయితీ అందిస్తున్న ప్లాన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
జియోలో రూ.899 ప్లాన్‌పై రాయితీ లభిస్తోంది. దీంట్లో రోజుకు 2 జీబీ డేటా పొందవచ్చు. ఈ ప్లాన్ వాలిడిటీ 90 రోజులుగా ఉంది. అంటే 3 నెలలు ఈ ప్లాన్ వాలిడిటీ ఉంటుందన్నమాట. ఇక రూ.999 ప్లాన్ లో కూడా ఈ ఆఫర్ లభిస్తోంది. ఈ ప్లాన్‌ను రీచార్జి చేసుకుంటే వినియోగదారులకు 98 రోజుల వాలిడిటీ లభిస్తుంది. ఇందులో కూడా రోజుకు 2 జీబీ డేటాను ఉచితంగా పొందవచ్చు.
10 ఓటీటీ యాప్‌లకు సబ్ స్క్రిప్షన్..
రూ.3599 ప్లాన్‌లో కూడా రాయితీని వినియోగదారులు పొందవచ్చు. ఇందులో వినియోగదారులకు రోజుకు 2.5 జీబీ డేటా వస్తుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 365 రోజులుగా ఉంది. అయితే ఈ మూడు ప్లాన్లలోనూ వినియోగదారులకు అన్‌లిమిటెడ్ కాల్స్‌తోపాటు రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. ఇక ఈ మూడు ప్లాన్లలో ఏ ప్లాన్ ను రీచార్జి చేసుకున్నా సరే వారికి 10 ఓటీటీ యాప్‌ల సబ్ స్క్రిప్షన్ 28 రోజుల పాటు ఉచితంగా లభిస్తుంది.
దీంతోపాటు ఈ ప్లాన్లను రీచార్జి చేసుకుంటే రూ.175 విలువైన 10జీబీ డేటా ఉచితంగా వస్తుంది. అలాగే 3 నెలల జొమాటో గోల్డ్ సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా పొందవచ్చు. దీంతో మరో రూ.30 ఆదా అవుతాయి. అలాగే AJIO కు సంబంధించిన రూ.500 విలువైన వోచర్ వస్తుంది. ఇలా కస్టమర్లు మొత్తం రూ.705 విలువైన బెనిఫిట్స్‌ను పొందుతారు. అంటే మీరు రీచార్జి చేసుకున్న మొత్తంలో రూ.705 వరకు మీకు డిస్కౌంట్ రూపంలో వెనక్కి వచ్చినట్లే. ఇలా ఈ ఆఫర్‌ను జియో తన కస్టమర్లకు అందిస్తోంది. ఇక ఇందుకు గాను సెప్టెంబర్ 10వ తేదీ వరకు గడువును విధించారు. కనుక ఈ ఆఫర్‌ను పొందాలనుకుంటే కస్టమర్లు వెంటనే ఈ ప్లాన్లలో దేన్నయినా రీచార్జి చేసుకోండి.