RRC NR Recruitment 2024 : నార్తర్న్ రైల్వే (Northern Railway) పరిధిలోని పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేసేందుకు గాను నోటిఫికేషన్‌ను రిలీజ్ చేశారు. ఢిల్లీలోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (Railway Recruitment Cell) ఈ నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. ఈ మేరకు నార్తర్న్ రైల్వే పరిధిలోని డివిజన్, వర్క్‌షాప్ యూనిట్లలో యాక్ట్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేస్తారు. ఇందుకు గాను అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ద్వారా మొత్తం 4096 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు గాను సెప్టెంబర్ 16, 2024ను చివరి తేదీగా నిర్ణయించారు. అభ్యర్థులు పూర్తి వివరాలను తెలుసుకోవాలంటే అధికారిక వెబ్‌సైట్ https://www.rrcnr.org/ ను సందర్శించాల్సి ఉంటుంది. మొత్తం 4096 యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు ఖాళీ ఉండగా ఈ పోస్టులకు టెన్త్ చదివిన వారు అర్హులు. అలాగే సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐలో పాస్ అయి ఉండాలి.
పలు ట్రేడ్‌లలో ఖాళీలు..
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు ఢిల్లీ, ఫిరోజ్‌పూర్, లక్నో, అంబాలా, మొరదాబాద్ తదితర క్లస్టర్ వర్క్ షాపుల్లో పనిచేయాల్సి ఉంటుంది. డేటా ఎంట్రీ ఆపరేటర్, రిఫ్రిజిరేటర్ అండ్ ఏసీ మెకానిక్, టర్నల్, మెకానికల్, ఎలక్ట్రిషియన్, ఫిట్టర్, కార్పెంటర్, ఎంఎంవీ, ఫోర్జర్ అండ్ హీట్ ట్రీటర్, వెల్డర్, మెషినిస్ట్, ట్రిమ్మర్, క్రేన్ ఆపరేటర్, స్టెనోగ్రాఫర్ తదితర ట్రేడ్‌లలో ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కనుక ఈ విభాగాలకు చెందిన అర్హులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు 16.09.2024 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. ఈ పోస్టులకు టెన్త్, ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. అలాగే డాక్యుమెంట్ల వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటాయి. ఈ ప్రకారం అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసేందుకు అభ్యర్థులు రూ.100 అప్లికేషన్ ఫీజును చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు ఎలాంటి ఫీజును చెల్లించాల్సిన పనిలేదు. ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. చివరి తేదీ సెప్టెంబర్ 16, 2024 కాగా మెరిట్ జాబితాను నవంబర్, 2024లో ప్రకటిస్తారు.