RRC WR Sports Quota Recruitment 2024 : టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. రైల్వేలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు..

RRC WR Sports Quota Recruitment 2024 : వెస్ట్ర‌న్ రైల్వే (Western Railway)లో ప‌లు విభాగాల్లో స్పోర్ట్స్ కోటాలో ఖాళీగా ఉన్న పోస్టులను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్నారు. ఈ మేర‌కు ముంబైలోని భార‌త ప్ర‌భుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ‌కు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (Railway Recruitment Cell) తాజాగా ఓ నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసింది. దీని ప్ర‌కారం 2024-25 సంవ‌త్స‌రానికి గాను స్పోర్ట్స్ కోటాలో గ్రూప్ సి, గ్రూప్ డి ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ ఖాళీల‌కు ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్నారు. ఈ నోటిఫికేష‌న్ ద్వారా మొత్తం 64 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ పోస్టుల‌కు సంబంధించి ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ఆగ‌స్టు 16 నుంచి ప్రారంభం అయింది.

ఈ పోస్టుల‌కు అర్హులైన పురుష‌, మ‌హిళా క్రీడాకారులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఇందుకు గాను సెప్టెంబ‌ర్ 14, 2024వ తేదీ వ‌ర‌కు గ‌డువును నిర్ణ‌యించారు. మొత్తం ఖాళీలు 64 ఉండ‌గా అందులో లెవ‌ల్ 4-5 పోస్టులు 5, లెవ‌ల్ 2-3 పోస్టులు 16, లెవ‌ల్ 1 పోస్టులు 43 ఉన్నాయి. లెవ‌ల్ 4-5 పోస్టుల‌కు ఏదైనా డిగ్రీ చ‌దివి ఉండాలి. లెవ‌ల్ 2-3 పోస్టుల‌కు ఐటీఐ, 12వ త‌ర‌గ‌తి చదివి ఉండాలి. లెవ‌ల్ 1 పోస్టుల‌కు టెన్త్, ఐటీఐ లేదా డిప్లొమా చ‌దివి ఉండాలి. దీంతోపాటు క్రీడ‌ల్లో విజ‌యాల‌ను సాధించి ఉండాలి. మ‌రిన్ని వివ‌రాల‌కు అధికారికంగా విడుద‌లైన నోటిఫికేష‌న్‌ను అభ్య‌ర్థులు చూడ‌వ‌చ్చు.

RRC WR Sports Quota Recruitment 2024 know the full details and how to apply
RRC WR Sports Quota Recruitment 2024

వ‌యో ప‌రిమితి నిబంధ‌న‌..

బాస్కెట్‌బాల్‌, క్రికెట్‌, రెజ్లింగ్‌, క‌బ‌డ్డీ, టేబుల్ టెన్నిస్‌, వెయిట్ లిఫ్టింగ్‌, అథ్లెటిక్స్‌, బాడీ బిల్డింగ్‌, సైక్లింగ్‌, హాకీ, ఖో-ఖో, ప‌వ‌ర్ లిఫ్టింగ్‌, స్విమ్మింగ్ త‌దిత‌ర క్రీడ‌ల్లో విజ‌యాలు సాధించి ఉండాలి. అభ్య‌ర్థుల‌కు వ‌య‌స్సు జ‌న‌వ‌రి 1, 2025 నాటికి 18 నుంచి 25 సంవ‌త్సరాల మ‌ధ్య ఉండాలి. అభ్య‌ర్థుల‌ను విద్యార్హ‌త‌, క్రీడా విజయాలు, గేమ్ స్కిల్‌, ఫిజిక‌ల్ ఫిట్‌నెస్‌, ట్ర‌య‌ల్స్ స‌మ‌యంలో కోచ్ ప‌రిశీలించే అంశాలు, డాక్యుమెంట్ వెరిఫికేష‌న్ త‌దిత‌రాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

ద‌ర‌ఖాస్తు ఫీజు..

ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు ఫీజును రూ.500గా నిర్ణ‌యించారు. ఎస్‌సీ, ఎస్‌టీ, ఈఎస్ఎం, దివ్యాంగులు, మ‌హిళ‌లు, మైనారిటీలు, ఈబీసీ అభ్య‌ర్థులు రూ.250 ఫీజు చెల్లించాలి. ఈ పోస్టుల‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్య‌ర్థుల ఎంపిక ప్ర‌క్రియ‌లో మెడిక‌ల్ ఎగ్జామినేష‌న్ కూడా ఉంటుంది. రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ నియ‌మ నిబంధ‌న‌ల ప్ర‌కారం అభ్య‌ర్థుల‌కు జీత‌భ‌త్యాల‌ను చెల్లిస్తారు. అభ్య‌ర్థులు మ‌రిన్ని వివ‌రాల‌కు https://rrc-wr.com/ అనే అధికారిక వెబ్‌సైట్‌ను సంద‌ర్శించి ఆన్‌లైన్‌లో ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.