SBI SO Recruitment 2024 : గుడ్ న్యూస్‌.. SBI లో ఉద్యోగాలు.. జీతం రూ.93వేలు..!

SBI SO Recruitment 2024 : దేశంలోని అతి పెద్ద ప్ర‌భుత్వ రంగ బ్యాంక్ అయిన State Bank of India (SBI) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ మేర‌కు బ్యాంకులో ఖాళీగా ఉన్న 1511 స్పెష‌లిస్ట్ కేడ‌ర్ ఆఫీస‌ర్ ఉద్యోగాల‌ను రెగ్యుల‌ర్ ప్రాతిప‌దిక‌న భ‌ర్తీ చేయ‌నున్నారు. దీనికి గాను SBI తాజాగా నోటిఫికేష‌న్‌ను రిలీజ్ చేసింది. SBI కి చెందిన సెంట్ర‌ల్ రిక్రూట్‌మెంట్ అండ్ ప్రమోష‌న్ డిపార్ట్‌మెంట్ వారు ఈ నోటిఫికేష‌న్‌ను రిలీజ్ చేశారు. ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు ఈ పోస్టుల‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేయాల్సి ఉంటుంది.

ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు అక్టోబ‌ర్ 4ను చివ‌రి తేదీగా నిర్ణ‌యించారు. ఈ పోస్టుల‌కు సంబంధించి రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ, డాక్యుమెంట్ల వెరిఫికేష‌న్‌, మెడిక‌ల్ ఎగ్జామినేష‌న్ ఆధారంగా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు. అభ్య‌ర్థులు మ‌రిన్ని వివ‌రాల‌ను https://sbi.co.in/web/careers/current-openings అనే వెబ్‌సైట్‌లో తెలుసుకోవ‌చ్చు.

SBI SO Recruitment 2024 full details and how to apply
SBI SO Recruitment 2024

మొత్తం 1511 ఖాళీలు..

మొత్తం 1511 ఉద్యోగాల్లో ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ అండ్ డెలివ‌రీ డిప్యూటీ మేనేజ‌ర్ పోస్టులు 187 ఖాళీ ఉండ‌గా, ఇన్‌ఫ్రా స‌పోర్ట్ అండ్ క్లౌడ్ ఆప‌రేష‌న్స్ డిప్యూటీ మేనేజ‌ర్ పోస్టులు 412 ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా నెట్‌వ‌ర్కింగ్ ఆప‌రేష‌న్స్ డిప్యూటీ మేనేజ‌ర్ పోస్టులు 80 ఖాళీ ఉన్నాయి. ఐటీ ఆర్కిటెక్ట్ డిప్యూటీ మేనేజ‌ర్ పోస్టులు 27 ఖాళీ ఉండ‌గా, ఇన్ఫ‌ర్మేష‌న్ సెక్యూరిటీ డిప్యూటీ మేనేజ‌ర్ పోస్టులు 7, సిస్ట‌మ్ అసిస్టెంట్ మేనేజ‌ర్ పోస్టులు 798 ఖాళీగా ఉన్నాయి.

పోస్టుల‌ను అనుస‌రించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌, ఎంసీఏ, ఎంటెక్‌, ఎమ్మెస్సీ ఉత్తీర్ణ‌త‌తోపాటు ప‌ని అనుభ‌వం ఉన్న వారికి ప్రాధాన్య‌త‌ను ఇస్తారు. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థుల వ‌య‌స్సు జూన్ 30, 2024 నాటికి డిప్యూటీ మేనేజ‌ర్ పోస్టుల‌కు అయితే 25 నుంచి 35 ఏళ్లు, అసిస్టెంట్ మేనేజ‌ర్ పోస్టుల‌కు అయితే 21 నుంచి 30 ఏళ్ల మ‌ధ్య వ‌య‌స్సు ఉండాలి. డిప్యూటీ మేనేజ‌ర్ పోస్టుకు రూ.64వేల నుంచి రూ.93వేలు, అసిస్టెంట్ మేనేజ‌ర్‌ల‌కు రూ.48వేల నుంచి రూ.85వేల వ‌ర‌కు జీతం ఇస్తారు.

ఎంపిక ఇలా..

ఈ పోస్టుల‌కు గాను రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూలు, డాక్యుమెంట్ల వెరిఫికేష‌న్‌, మెడిక‌ల్ ఎగ్జామినేష‌న్ ఆధారంగా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు. అప్లికేష‌న్ ద‌ర‌ఖాస్తు ఫీజు రూ.750 కాగా, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల‌కు ఫీజు నుంచి మిన‌హాయింపును ఇచ్చారు. పోస్టుల‌కు ఎంపికైన అభ్య‌ర్థులు ముంబై లేదా హైద‌రాబాద్‌లో ప‌నిచేయాల్సి ఉంటుంది. ఈ పోస్టుల‌కు ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి. సెప్టెంబ‌ర్ 14 నుంచి ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం కాగా ద‌ర‌ఖాస్తుల‌కు గాను అక్టోబ‌ర్ 4ను చివ‌రి తేదీగా నిర్ణ‌యించారు. కాబ‌ట్టి ఆస‌క్తి, అర్హ‌త ఉన్న వారు ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. మ‌రిన్ని వివ‌రాల‌కు పైన ఇచ్చిన వెబ్‌సైట్‌ను సంద‌ర్శించ‌వ‌చ్చు. అక్క‌డే ఆన్‌లైన్‌లో ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేయ‌వ‌చ్చు.