Connect with us

Latest Jobs

సౌత్ సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (SCCL CIL) రిక్రూట్‌మెంట్ – 2019

Published

on

SCCL CIL రిక్రూట్‌మెంట్ 2019

నిజామా ? కాదా ?

ఇటువంటి ఏజెన్సీలు ఉద్యోగ ఆఫర్లతో ఉద్యోగార్ధులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తారు మరియు నకిలీ నోటిఫికేషన్ ను జారీ చేస్తారు. కల్పిత లెటర్‌హెడ్‌లు మరియు సిఐఎల్ యొక్క ఇతర వివరాలను ఉపయోగించి అపాయింట్‌మెంట్ లెటర్స్, సెక్యూరిటీ డిపాజిట్ లేదా ప్రాసెసింగ్ ఫీజు మొదలైనవి జారీ చేస్తారు. సాధారణంగా ప్రజలు మరియు ఉద్యోగార్ధులు అటువంటి మోసగాళ్ల ఏజెన్సీల చేతులలో పడవద్దని సలహా ఇస్తున్నాము.

అభ్యర్థులు ఇది గమనించి దయచేసి ఈ వెబ్సైట్ లో రిజిస్టర్ అయ్యి మోసపోకండి. మీ స్నేహితులకు, బందువులకు తెలియజేయండి.

భారత ప్రభుత్వ రంగానికి చెందిన కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన సౌత్ సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాల కు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 88585 పోస్టుల్ని భర్తీ చేయబోతోంది సౌత్ సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌-SCCLCIL. జూనియర్ ఇంజనీర్, ఎంటీఎస్ సర్వేయర్, అకౌంట్స్ క్లర్క్, అకౌంటెంట్, జూనియర్ క్లర్క్, కంప్యూటర్ ఆపరేటర్, స్టెనోగ్రాఫర్ లాంటి పోస్టులున్నాయి.

టెన్త్, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ పాసైనవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఆసక్తిగల అభ్యర్థులు నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను వెబ్‌సైట్‌లో చూడొచ్చు. దరఖాస్తుకు 2019 అక్టోబర్ 19 చివరి తేదీ. మొత్తం 88585 ఖాళీల భర్తీ చేయడానికి సౌత్ సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌-SCCLCIL జారీ చేసిన నోటిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకొవచ్చు.

దరఖాస్తు మరియు పోస్టుల వివరాలు క్రింద చూసి తెలుసుకోవచ్చు:

 

పోస్ట్ పేరు ఖాళీల వివరాలు
మొత్తం పోస్టులు 88585
ఎంటీఎస్ సర్వేయర్ 20390
అకౌంట్స్ క్లర్క్ 322
అకౌంటెంట్స్ 140
జూనియర్ క్లర్క్ 382
కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రో అసిస్టెన్స్ 5224
స్టెనోగ్రాఫర్ ఇంగ్లీష్ 1600
స్టెనోగ్రాఫర్ హిందీ 1600
సెక్రెటేరియల్ అసిస్టెంట్ 560
ఎలక్ట్రీషియన్ 5970
ఫిట్టర్ 4376
వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్) 3200
వెల్డర్ (Mig & Arg) 4380
టర్నర్ 7430
మెషినిస్ట్స్ 6135
డీజిల్ మెకానిక్ 4850
డ్రాఫ్ట్స్‌మన్ (సివిల్) 2480
డ్రాఫ్ట్స్‌మన్ (మెకానికల్) 3798
ప్లంబర్ 5670
ట్రేడ్ సూపర్‌వైజర్స్ 2230
కార్పెంటర్ 4200
హెవీ వెహికిల్ డ్రైవర్స్ 1250
ఫోర్క్ లిఫ్ట్ ఆపరేటర్స్ 720
జూనియర్ మెకానికల్ ఇంజనీర్స్ 430
జూనియర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ 430
అసిస్టెంట్ మేనేజర్ 178

అర్హతలు :

10వ తరగతి: ఎంటీఎస్ సర్వేయర్

ఇంటర్ లేదా 12వ తరగతి: అకౌంట్స్ క్లర్క్, జూనియర్ క్లర్క్, స్టెనోగ్రాఫర్ ఇంగ్లీష్, స్టెనోగ్రాఫర్ హిందీ,
డిగ్రీ: అకౌంటెంట్స్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రో అసిస్టెన్స్, అసిస్టెంట్ మేనేజర్

ఐటీఐ లేదా డిప్లొమా: ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, వెల్డర్, టర్నర్, డీజిల్ మెకానిక్, డ్రాఫ్ట్స్‌మన్ (సివిల్), డ్రాఫ్ట్స్‌మన్ (మెకానికల్), ప్లంబర్, ట్రేడ్ సూపర్‌వైజర్, కార్పెంటర్, ఫోర్క్ లిఫ్ట్ ఆపరేటర్, జూనియర్ సివిల్ ఇంజనీర్, జూనియర్ మెకానికల్ ఇంజనీర్, జూనియర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్

బీటెక్: డ్రాఫ్ట్స్‌మన్ (సివిల్), డ్రాఫ్ట్స్‌మన్ (మెకానికల్), జూనియర్ సివిల్ ఇంజనీర్, జూనియర్ మెకానికల్ ఇంజనీర్, జూనియర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ : 2019 జూలై 25

దరఖాస్తు ముగింపు తేదీ: 2019 అక్టోబర్ 19

వయస్సు:  అభ్యర్థులు 25.07.2019 నాటికి కనీసం 18 సంవత్సరాల నుండి గరిష్టంగా 35 సంవత్సరాల వరకు పూర్తి చేసి ఉండాలి.  వివరాల కోసం, అభ్యర్థులు SCCL CIL నోటిఫికేషన్ 2019 ని చూడవచ్చు.

ఫీజు వివరాలు :

జనరల్ / ఓబిసికి – రూ. 350 / –

ఎస్సీ / ఎస్టీకి – రూ. 180 / –

దరఖాస్తు వివరాలుకు క్రింద లింక్ చూడండి.

వెబ్ సైట్ : http://www.scclcil.in 

Free Subscription

Enter your email address:

Trending