SSC CHTE 2024 : కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పలు విభాగాల్లో పనిచేసేందుకు గాను అర్హులైన అభ్యర్థుల నుంచి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) వారు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు పలు విభాగాల్లో హిందీ ట్రాన్స్‌లేటర్, జూనియర్ ట్రాన్స్‌లేటర్ ఆఫీసర్, జూనియర్ ట్రాన్స్‌లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టుల్లో పనిచేయాల్సి ఉంటుంది. ఇందుకుగాను నిర్వహించిఏ రాత పరీక్షకు సంబంధించిన కంబైన్డ్ హిందీ ట్రాన్స్‌లేటర్స్ ఎగ్జామినేషన్ 2024 ప్రకటనను విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 312 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. ఇందుకు గాను ఆగస్టు 25, 2024వ తేదీ వరకు గడువును నిర్ణయించారు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ https://ssc.nic.in/ ను సందర్శించవచ్చు.
డిగ్రీ లేదా పీజీ ఉండాలి..
ఈ రిక్రూట్మెంట్లో భాగంగా మొత్తం 312 పోస్టులను భర్తీ చేస్తారు. పోస్టును అనుసరించి మాస్టర్ డిగ్రీ (హిందీ/ఇంగ్లిష్), డిగ్రీ స్థాయిలో హిందీ/ఇంగ్లిష్ సబ్జెక్ట్ పాఠ్యాంశంగా ఉండాలి. దీంతోపాటు ట్రాన్స్లేషన్ (హిందీ/ఇంగ్లిష్) డిప్లొమా/సర్టిఫికెట్ కోర్సు చేసి ఉండాలి. లేదా కేంద్ర ప్రభుత్వ సంస్థలో ట్రాన్స్‌లేటర్‌గా అనుభవం ఉండాలి. సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీతోపాటు ట్రాన్స్‌లేటర్ అనుభవం ఉంటే మంచిది. బ్యాచిలర్ డిగ్రీ/పీజీ (హిందీ/ఇంగ్లిష్) అర్హతతోపాటు తగిన అనుభవం ఉండాలి. డిగ్రీ స్థాయిలో హిందీ/ఇంగ్లిష్ సబ్జెక్టును పాఠ్యాంశంగా కలిగి ఉండాల్సి ఉంటుంది.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థుల వయస్సు ఆగస్టు 1, 2024 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం గరిష్ట వయో పరిమితిలో సడలింపులు ఇస్తారు. ఈ పోస్టుల్లో హిందీ ట్రాన్స్‌లేటర్ లేదా సీనియర్ ట్రాన్స్‌లేటర్ పోస్టులకు నెలకు రూ.44,900 నుంచి రూ.1,42,400 వేతనం ఇస్తారు. ఇతర పోస్టులకు అయితే రూ.35,400 నుంచి రూ.1,12,400 నెల వేతనం ఇస్తారు.
ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.100 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన పనిలేదు. ఆన్లైన్లో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు చివరి తేదీ ఆగస్టు 25, 2024. కనుక అర్హులైన అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తు పెట్టుకోవచ్చు.