SSC Stenographer Recruitment 2024 : నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. ఇంట‌ర్ పాసైతే చాలు.. కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగం..!

SSC Stenographer Recruitment 2024 : కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే ఈ గొప్ప అవ‌కాశాన్ని అస‌లు మిస్ చేసుకోకండి. ఈ ఉద్యోగాల‌ను పొందాలంటే కేవ‌లం ఇంట‌ర్ పాస్ అయితే చాలు. ఇక ఈ వివ‌రాల‌ను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కేంద్ర ప్ర‌భుత్వం ఏటా ప‌లు ప్ర‌భుత్వ శాఖ‌ల్లో ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేస్తుంద‌న్న విష‌యం తెలిసిందే. అందులో భాగంగా స్టాఫ్ సెలెక్ష‌న్ క‌మిష‌న్ (ఎస్ఎస్‌సీ) ఈ రిక్రూట్‌మెంట్ ప్ర‌క్రియ‌ను చేప‌డుతుంది. ఇక తాజాగా ఎస్ఎస్‌సీ మరో నోటిఫికేష‌న్‌ను జారీ చేసింది. ఈ మేర‌కు మొత్తం 2006 కేంద్ర ప్ర‌భుత్వ శాఖల ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. వీటిల్లో స్టెనోగ్రాఫ‌ర్ గ్రేడ్ సి (గ్రూప్‌-బి, నాన్ గెజిటెడ్‌), స్టెనోగ్రాఫ‌ర్ గ్రేడ్ డి పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తారు.

ఇక ఈ ఉద్యోగాల‌కు గాను అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. అభ్య‌ర్థులు కేవ‌లం ఇంట‌ర్ పాస్ అయితే చాలు. అలాగే స్టెనోగ్ర‌ఫీలో నైపుణ్యాన్ని క‌లిగి ఉండాలి. అభ్య‌ర్థుల వ‌య‌స్సు ఆగ‌స్టు 1, 2024 నాటికి స్టెనోగ్రాఫ‌ర్ గ్రేడ్ సి పోస్టుల‌కు 18 నుంచి 30 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. అలాగే గ్రేడ్ డి పోస్టుల‌కు 18 నుంచి 27 ఏళ్ల మ‌ధ్య వ‌య‌స్సు ఉండాలి. అయితే ఎస్సీలు, ఎస్టీల‌కు 5 ఏళ్లు, ఓబీసీల‌కు 3 ఏళ్లు, దివ్యాంగుల‌కు 10 నుంచి 15 ఏళ్ల చొప్పున వ‌యో ప‌రిమితిలో స‌డ‌లింపులు ఉంటాయి.

SSC Stenographer Recruitment 2024 full details how to apply and eligibility
SSC Stenographer Recruitment 2024

కంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) ఆధారంగా ఎంపిక..

ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు ఆస‌క్తి ఉన్న అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవ‌చ్చు. ఇందుకు చివ‌రి తేదీని ఆగ‌స్టు 17, 2024గా నిర్ణ‌యించారు. ద‌ర‌ఖాస్తు రుసుముగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. అయితే మ‌హిళ‌లు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌-స‌ర్వీస్‌మెన్‌, దివ్యాంగులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన ప‌నిలేదు. కంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ), స్టెనోగ్ర‌ఫీలో స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు.

ఈ పోస్టుల‌కు గాను రాత ప‌రీక్ష ఉంటుంది. అందులో జ‌న‌ర‌ల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్‌, జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్‌, ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రెహెన్ష‌న్ త‌దిత‌ర విభాగాల నుంచి ప్ర‌శ్న‌లు వ‌స్తాయి. జ‌న‌ర‌ల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజినింగ్ నుంచి 50 ప్ర‌శ్న‌ల‌కు 50 మార్కులు, జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్ విభాగం నుంచి 50 ప్ర‌శ్న‌ల‌కు 50 మార్కులు ఉంటాయి. అలాగే ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్ర‌హెన్ష‌న్ నుంచి 100 ప్ర‌శ్న‌ల‌కు 100 మార్కుల చొప్పున ఉంటాయి. ఇక అన్ని ప్ర‌శ్న‌ల‌ను ఆబ్జెక్టివ్ టైప్ మ‌ల్టిపుల్ చాయిస్ ప‌ద్ధ‌తిలో అడుగుతారు. ప్ర‌శ్నాప‌త్రం ఇంగ్లిష్‌, హిందీల‌లో ఉంటుంది. మొత్తం 2 గంట‌ల్లో ప‌రీక్ష రాయాలి. 200 మార్కులు ఉంటాయి.

చివ‌రీ తేదీలు..

ఈ పోస్టుల‌కు గాను జూలై 26, 2024 తేదీన ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులు ప్రారంభం అయ్యాయి. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు చివ‌రీ తేదీ ఆగ‌స్టు 17, 2024. ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివ‌రి తేదీ ఆగ‌స్టు 18, 2024. ద‌ర‌ఖాస్తు స‌వ‌ర‌ణ‌కు చివ‌రి తేదీలు ఆగ‌స్టు 27, 28. కంప్యూట‌ర్ బేస్డ్ టేస్ట్ ప‌రీక్ష తేదీ అక్టోబ‌ర్ లేదా న‌వంబ‌ర్ 2024లో ఉంటుంది. ఇక మ‌రిన్ని వివ‌రాల‌కు స్టాఫ్ సెలెక్ష‌న్ క‌మిష‌న్ (ఎస్ఎస్‌సీ) వెబ్‌సైట్ https://ssc.gov.in/ ను సంద‌ర్శించవ‌చ్చు.