తెలంగాణ యువతకు గుడ్ న్యూస్.. అంగన్‌వాడీల్లో 11వేల ఉద్యోగాలు..!
తెలంగాణ రాష్ట్రంలో 11వేల అంగన్ వాడీ పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క వివరాలను వెల్లడించారు. దీంతోపాటు రాష్ట్రంలో 15వేల అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్లే స్కూల్స్‌ను ప్రారంభిస్తామని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 11వేల వరకు అంగన్ వాడీ పోస్టులు ఖాళీగా ఉన్నాయని అన్నారు. ఈ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 35,700 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా … Read more