జియోలో ఉన్న బెస్ట్ ప్లాన్స్ ఇవే.. వీటిలో ఏదో ఒకటి రీచార్జి చేసుకోండి చాలు..!

టెలికాం సంస్థ రిల‌య‌న్స్ జియో ఈ ఏడాది ఆగ‌స్టు 1 నుంచి ప్రీపెయిడ్ మొబైల్ టారిఫ్‌ల‌ను పెంచిన విష‌యం తెలిసిందే. అలాగే ఈమ‌ధ్యే పోస్ట్‌పెయిడ్ టారిఫ్‌ల‌ను కూడా పెంచారు. అయితే జియోలో ప‌లు ప్లాన్లు మాత్రం ఇప్ప‌టికీ పాపుల‌ర్‌గానే ఉన్నాయి. ఎందుకంటే అవి అందిస్తున్న బెనిఫిట్సే కార‌ణ‌మ‌ని చెప్ప‌వ‌చ్చు. ఇక జియోలో ఉన్న ప‌లు పాపుల‌ర్ ప్లాన్ల వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

జియోలో రూ.449 ప్లాన్‌తో రీచార్జి చేసుకుంటే వినియోగ‌దారుల‌కు 28 రోజుల వాలిడిటీ వ‌స్తుంది. రోజుకు 3 జీబీ డేటా ఉచితంగా ల‌భిస్తుంది. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవ‌చ్చు. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు వ‌స్తాయి. హై స్పీడ్ ఇంట‌ర్నెట్ డేటా వ‌స్తుంది. ఈ ప్లాన్ తీసుకుంటే ప‌లు జియో యాప్స్‌ను ఉచితంగా వాడుకోవ‌చ్చు. అలాగే రూ.448 ప్లాన్ కూడా ప్రీపెయిడ్‌లో అందుబాటులో ఉంది. దీని ద్వారా క‌స్ట‌మ‌ర్ల‌కు రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు వ‌స్తాయి. రోజుకు 2 జీబీ డేటాను వాడుకోవ‌చ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ వ‌స్తాయి. 12 ఓటీటీ యాప్స్‌కు ఉచితంగా స‌బ్‌స్క్రిప్ష‌న్ ల‌భిస్తుంది.

these are the best and trending plans in reliance jio

రూ.399 ప్లాన్‌తో..

జియోలో రూ.399 ప్లాన్‌ను రీచార్జి చేసుకుంటే రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, 2జీబీ డేటా ఉచితంగా వ‌స్తాయి. రూ.349 ప్లాన్‌ను రీచార్జి చేసుకుంటే దీనికి 28 రోజుల వాలిడిటీ ల‌భిస్తుంది. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, 2జీబీ డేటా ఉచితంగా వ‌స్తాయి. రూ.329 ప్లాన్ ద్వారా 28 రోజుల వాలిడిటీని పొంద‌వ‌చ్చు. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, 1.5జీబీ డేటాను పొంద‌వ‌చ్చు. జియో యాప్స్ ఉచితంగా ల‌భిస్తాయి.

ఇక జియో ఫోన్ యూజ‌ర్ల‌కు మాత్రం రూ.91 కే అద్భుత‌మైన ప్లాన్ అందుబాటులో ఉంది. దీన్ని రీచార్జి చేసుకుంటే అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవ‌చ్చు. 50 ఎస్ఎంఎస్‌లు ఉచితంగా ల‌భిస్తాయి. రోజుకు 100 ఎంబీ డేటాను వాడుకోవ‌చ్చు. జియో యాప్స్ కూడా ఉచితంగానే వ‌స్తాయి. ఇక ఈ ప్లాన్స్ అన్నీ ప్ర‌స్తుతం జియోలో ట్రెండింగ్‌లో ఉన్నాయి.