Visa Free Countries For India 2024 : ఈమధ్యే ఇండియన్ పాస్‌పోర్ట్ శక్తి పెరిగిన విషయం తెలిసిందే. హెన్లీ పాస్ పోర్ట్ ఇండెక్స్ 2024 జాబితాలో భారతీయ పాస్ పోర్టుకు 80వ స్థానం దక్కింది. దీంతో భారతీయ పాస్ పోర్టు కలిగి ఉన్నవారికి వీసా లేకుండానే అనుమతించే దేశాల సంఖ్య 62కు చేరింది. దీంతో ఆయా దేశాలకు భారతీయ పౌరులు వీసా లేకుండానే వెళ్లవచ్చు. దీంతో ఎంతో సమయం, డబ్బు ఆదా అవుతాయి. ఇక భారతీయులు వీసా లేకుండా ఏయే దేశాలకు వెళ్లవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
మన దేశానికి పొరుగునే ఉండే దేశం భూటాన్. ఈ దేశానికి మనం వీసా లేకుండానే వెళ్లవచ్చు. అక్కడి ఎయిర్‌పోర్టులో దిగిన తరువాత టూరిజం వీసా ఇస్తారు. దీనికి గరిష్టంగా 14 రోజుల వరకు గడువు ఉంటుంది. అక్కడ అన్ని రోజుల పాటు ఉండవచ్చు. భూటాన్ దేశాన్ని ల్యాండ్ ఆఫ్ ది థండర్ డ్రాగన్ అని పిలుస్తారు. ఇక్కడి పర్వత శ్రేణులు, ప్రకృతి రమణీయత పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఈ దేశానికి భారతీయులు వీసా లేకుండా ప్రయాణించవచ్చు. అలాగే నేపాల్ దేశానికి కూడా ఈ విధంగా ప్రయాణం చేయవచ్చు.
మారిషస్‌కు 90 రోజులు వెళ్లవచ్చు..
భారతీయులు నేపాల్‌లో ఉండేందుకు ప్రత్యేక నియమాలు అంటూ ఏవీ లేవు. మనం ఈ దేశానికి కూడా వీసా లేకుండానే వెళ్లవచ్చు. ఇక మారిషస్ దేశానికి ట్రావెల్ వీసాపై మనం 90 రోజులపాటు వెళ్లవచ్చు. ఇందుకు ముందుగా వీసా తీసుకోవాల్సిన పనిలేదు. అక్కడికి చేరుకున్న తరువాత ఈ వీసా పొందవచ్చు. దీంతో ఎంతో సమయం ఆదా అవుతుంది. అలాగే కెన్యాకు కూడా 90 రోజుల పాటు వెళ్లవచ్చు. మలేషియాకు 30 రోజులు, థాయ్‌లాండ్‌కు 30 రోజులు, డొమినికా దేశానికి 6 నెలల పాటు వీసా లేకుండా వెళ్లవచ్చు.
ఖతార్ దేశానికి అయితే భారతీయులు వీసా లేకుండా 30 రోజుల పాటు వెళ్లవచ్చు. శ్రీలంకకు 30 రోజులు, Seychelles అనే దేశానికి కూడా 30 రోజుల పాటు మనం వీసా లేకుండా ప్రయాణించవచ్చు. అయితే భారతీయ పాస్ పోర్టుకు ఏటా విలువ పెరుగుతుంది కనుక త్వరలో మరిన్ని దేశాలకు మనం వీసా లేకుండానే ప్రయాణం చేసే సౌలభ్యం మనకు అందుబాటులోకి రానుంది.