West Central Railways Apprenticeship 2024 : రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC) వెస్టర్న్ సెంట్రల్ రైల్వే (WCR)లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీకి గాను తాజాగా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా మొత్తం 3317 పోస్టులను భర్తీ చేయనున్నారు. టెన్త్, ఐటీఐ చదివిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అభ్యర్థులు మరిన్ని వివరాలకు wcr.indianrailways.gov.in అనే అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు సెప్టెంబర్ 4, 2024ను చివరి తేదీగా నిర్ణయించారు.
ఈ పోస్టులకు గాను అభ్యర్థులు పైన ఇచ్చిన వెబ్ సైట్‌ను సందర్శించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు వెస్ట్ సెంట్రల్ రైల్వేస్ పరిధిలోని జేబీపీ డివిజన్, బీపీఎల్ డివిజన్, కోటా డివిజన్, సీఆర్‌డబ్ల్యూఎస్ బీపీఎల్, డబ్ల్యూఆర్ఎస్ కోటా, జేబీపీ హెడ్ క్వార్టర్స్‌లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
వయో పరిమితిలో సడలింపులు..
జేబీపీ డివిజన్‌లో 1262 ఖాళీలు ఉండగా, బీపీఎల్ డివిజన్‌లో 824, కోటా డివిజన్‌లో 832, సీఆర్‌డబ్ల్యూఎస్ బీపీఎల్‌లో 175, డబ్ల్యూఆర్ఎస్ కోటాలో 196, హెచ్‌క్యూ జేబీపీలో 28 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థులు టెన్త్ లో కనీసం 50 మార్కులతో ఉత్తీర్ణులు అయి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్‌ను కలిగి ఉండాలి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరిలకు చెందిన అభ్యర్థులకు గరిష్ట వయో పరిమితిలో సడలింపులు ఉంటాయి.
అభ్యర్థులను టెన్త్‌లో వచ్చిన మార్కులతోపాటు ట్రేడ్‌లో సాధించిన మెరిట్ ఆధారంగా ఇంటర్వ్యూలు చేసి ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు అభ్యర్థులు రూ.141 దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్‌టీ, పీడబ్ల్యూబీడీ, మహిళా అభ్యర్థులు రూ.41 ఫీజు చెల్లించాలి. ఎంపికైన అభ్యర్థులకు ట్రెయినింగ్‌లో భాగంగా ప్రభుత్వ నిబంధనల మేరకు స్టైపెండ్ ఇవ్వబడుతుంది. మరిన్ని వివరాలకు అభ్యర్థులు https://nitplrrc.com/RRC_JBP_ACT2024/ అనే సైట్‌ను సందర్శించి నోటిఫికేషన్‌ను చూడవచ్చు. అక్కడే ఆన్‌లైన్‌లో ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.