మనకు మార్కెట్‌లో అనేక రకాల పెట్రోల్స్ అందుబాటులో ఉన్నాయి. పలు రకాల సంస్థలు మనకు పెట్రోల్‌ను పంపుల్లో విక్రయిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఒక్కొక్కరు తమకు నచ్చిన పెట్రోల్‌ను టూవీలర్లలో కొట్టిస్తుంటారు. అయితే మీకు ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా.. ఏ సంస్థకు చెందిన పెట్రోల్ మనకు ఎక్కువ మైలేజీని ఇస్తుంది..? అని. అవును, వారు కూడా సరిగ్గా ఇదే ఆలోచన చేశారు. ఇంకేముంది.. భిన్న రకాల కంపెనీలకు చెందిన పెట్రోల్‌లను ఒక టూవీలర్ లో పోసి మైలేజ్ ఎంత వస్తుందో చెక్ చేశారు. దీంతో ఆశ్చర్యకరమైన ఫలితాలు వచ్చాయి. అవేమిటంటే..
యూట్యూబ్ లో మ్యాడ్ బ్రదర్స్ అనే చానల్ వారు ఏ కంపెనీ పెట్రోల్‌కు టూవీలర్ ఎంత మైలేజ్ ఇస్తుందనే విషయంపై ప్రయోగాత్మకంగా టెస్ట్ చేశారు. బైక్‌లో పెట్రోల్ పోసిన తరువాత ఒకే లాంటి స్పీడ్‌తో వారు మైలేజ్ చెక్ చేశారు. దీంతో అన్ని కంపెనీల కన్నా రిలయన్స్ కంపెనీకి చెందిన పెట్రోల్ అధిక మైలేజ్‌ను ఇస్తున్నట్లు వారు చెప్పారు. 1 లీటర్ రిలయన్స్ పెట్రోల్ సుమారుగా 67 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇచ్చిందని వారు చెప్పారు.
చివర్లో ఉంది ఇది..
ఇక ఈ జాబితాలో హెచ్‌పీ పెట్రోల్ రెండో స్థానంలో నిలవడం విశేషం. 1 లీటర్ హెచ్‌పీ పెట్రోల్‌ను వారు వాడితే 61 కిలోమీటర్ల మైలేజ్ వచ్చింది. అలాగే భారత్ పెట్రోలియం కంపెనీకి చెందిన పెట్రోల్ 1 లీటర్‌కు 58 కిలోమీటర్లను మైలేజ్‌గా ఇచ్చింది. అంటే ఇది మూడో స్థానంలో నిలిచిందని అర్థం. ఇక ఇండియన్ ఆయిల్‌కు చెందిన పెట్రోల్ చాలా తక్కువ మైలేజ్‌ని ఇచ్చిందని వారు చెప్పారు. 1 లీటర్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ వారికి 50 కిలోమీటర్ల మైలేజీని మాత్రమే ఇచ్చిందట. దీంతో ఈ కంపెనీ 4వ స్థానంలో నిలిచింది.
అయితే ఇలా వారు పెట్రోల్‌ను టెస్ట్ చేయడంతో వారి వీడియో వైరల్‌గా మారింది. దీంతో వాహనదారులు సైతం ఏ కంపెనీకి చెందిన పెట్రోల్ ఎక్కువ మైలేజ్ ఇస్తుందో తెలుసుకుని, ఫలితాలను చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇక మీరు కూడా లిస్ట్‌లో ఫస్ట్ వచ్చిన రిలయన్స్ పెట్రోల్‌ను కొట్టించుకునేందుకు సిద్ధం అవుతున్నారు కదా. వెళ్లి రండి మరి ఇంక.