LIC లో Work From Home Jobs.. ఇంట‌ర్ పాస్ అయితే చాలు, ఎవ‌రైనా అప్లై చేయ‌వ‌చ్చు..

ప్ర‌స్తుత తరుణంలో దేశంలో నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో అంద‌రికీ తెలిసిందే. నిరుద్యోగిత రేటు ఏటా భారీగా పెరుగుతోంది. అయిన‌ప్ప‌టికీ ఉద్యోగాల‌ను క‌ల్పించ‌డంలో లేదా ఉపాధిని చూపించ‌డంలో ప్ర‌భుత్వాలు విఫం అవుతున్నాయి. ఇక నిరుద్యోగులు, యువ‌త పూర్తిగా నిరుత్సాహంతో ఉన్నారు. కానీ చిన్న జాబ్ దొరికినా చాలు, అందులో చేరిపోతున్నారు. అర్హ‌త‌కు త‌గిన ఉద్యోగం అవ‌క‌పోయినా డబ్బు అవ‌స‌రం క‌నుక చాలా మంది తాము చ‌దివిన చ‌దువుతో సంబంధం లేకుండా ఉద్యోగాలు చేస్తున్నారు. ఇక ఈ కోవ‌లోనే Life Insurance Corporation of India (LIC) కూడా నిరుద్యోగుల‌కు అవ‌కాశం క‌ల్పిస్తోంది. అందులో వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ ఉద్యోగాల‌ను లేదా ఫుల్ టైమ్ ఉద్యోగాల‌ను చేయ‌వ‌చ్చు.. అంటూ నోటిఫికేష‌న్‌ను ఇచ్చింది. ఇక వివ‌రాల్లోకి వెళితే..

ఉద్యోగార్థుల‌కు, నిరుద్యోగుల‌కు, యువ‌త‌కు ఇది నిజంగా తీపి క‌బురే అని చెప్ప‌వ‌చ్చు. ఇంటి వ‌ద్ద ఉంటూనే ప‌నిచేసుకునే అవ‌కాశాన్ని క‌ల్పిస్తున్నారు. లేటెస్ట్‌గా LIC సూప‌ర్ వైజ‌ర్ పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు సిద్ధ‌మ‌వుతోంది. మొత్తం 50 ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేస్తారు. ఈ ఉద్యోగాల‌కు ఇంట‌ర్ చ‌దివినా చాలు, అప్లై చేయ‌వ‌చ్చు. అలాగే మార్కెటింగ్ స్కిల్స్ క‌లిగి ఉంటే మంచిది. స్త్రీ, పురుషులు ఇరువురూ ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు వ‌య‌స్సు 18 సంవ‌త్స‌రాలు నిండి ఉండాలి. ఈ ఉద్యోగాల‌కు సంబంధించి అప్లికేష‌న్ల‌ను షార్ట్ లిస్ట్ చేసి ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

work from home jobs in LIC know full details and how to apply

ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు ఈ ఉద్యోగాల‌కు అక్టోబ‌ర్ 8వ తేదీ వ‌రు ద‌ర‌ఖాస్తు చేసుకునే అవ‌కాశం క‌ల్పించారు. మ‌రిన్ని వివ‌రాల‌కు https://www.ncs.gov.in/ అనే వెబ్‌సైట్‌ను అభ్య‌ర్థులు సంద‌ర్శించ‌వ‌చ్చు. అందులోనే వివ‌రాల‌ను తెలుసుకోవ‌చ్చు. ఇక అక్క‌డే ఆన్‌లైన్‌లో ఈ జాబ్స్‌కు ద‌ర‌ఖాస్తు చేయ‌వ‌చ్చు.